ఆ పార్టీకి 50 సీట్లు కూడా రావన్న మోదీ
x

ఆ పార్టీకి 50 సీట్లు కూడా రావన్న మోదీ

ఒడిశాలో తమ పార్టీ గెలవబోతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కంధమాల్ లోక్‌సభ స్థానంలోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..


ఒడిశాలో తమ పార్టీ గెలవబోతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కంధమాల్ లోక్‌సభ స్థానంలోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావని, ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడుతుందని, ఒడిశా భాష, సంస్కృతిని అర్థం చేసుకునే వ్యక్తినే సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున పోఖ్రాన్ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచాయని అన్నారు.

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా తమ ప్రభుత్వం 500 ఏళ్ల ప్రజల కలను నిజం చేసిందని చెప్పారు.

Read More
Next Story