24 గంటలు ధ్యానం చేయనున్న మోదీ.. ఎక్కడంటే..
x

24 గంటలు ధ్యానం చేయనున్న మోదీ.. ఎక్కడంటే..

మే 30 సాయంత్రం నుంచి ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు. ఈ ధ్యానం 24 గంటలు కొనసాగనుంది. కన్యాకుమారిలో మోదీ ఈ ధ్యానం చేయనున్న ప్రాంతం ఎంత ప్రత్యేకమో తెలుసా..


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో పర్యటించి ప్రత్యేక సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మే 30 నుంచి జూన్ 1 తేదీ వరకు ఆయన తమిళనాడు పర్యటించనున్నారు. మే 30తో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఆయన 24 గంటల పాటు నిరవధిక ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఆయన ధ్యానం చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రకటించారు.

ధ్యానం ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..

మే 30 తేదీని ఎన్నికల ప్రచారం ముగించుకున్న మోదీ.. ఆరోజు సాయంత్రమే ప్రధాని మోదీ ధ్యానంలో కూర్చుంటారని, జూన్ 1 వరకు అదే విధంగా ధ్యాన మండపంలో ధ్యానం చేస్తారని వివరించారు. ఈ 24 గంటల పాటు ధ్యానంలోనే ఉంటారని, ఆ సమయంలో ఎవరినీ పలకరించను కూడా పలకరించరని వారు వివరించారు.

ఇదే తొలిసారి కాదు..

ఇలా 24 గంటలు ధ్యానం చేయడం మోదీకి ఇది తొలిసారి కాదు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత కూడా కేదార్నాథ్ గుహలో ఇదే విధంగా ఆయన ధ్యానం చేశారు. ఈ నేపథ్యంలోనే కన్యాకుమారిలో మోదీ ధ్యానం చేయనుండటంపై పార్టీ నేతలు స్పందించారు. ధ్యానం చేయడానికి ప్రధాని మోదీ కావాలనే ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. దేశం పట్ల వివేకానందకు ఉన్న విజన్‌ను ఫలవంతం చేయడంలో తన నిబద్దతను చూపడానికే ఆ ప్రాంతాన్ని మోదీ ఎన్నికున్నారని చెప్పారు.


ఈ ప్రాంతం చాలా పవిత్రం

ప్రధాని మోదీ 24 గంటల పాటు ధ్యానం చేయనున్న వివేకానంద రాక్ మెమోరియల్‌కు మన పురాణాలు, చరిత్రలో కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది. శివుడి కోసం ఎదురుచూస్తూ పార్వతీ దేవి ఒకే పాదంపై ధ్యానం చేశారు. అది కన్యాకుమారిలోనే అని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రాంతానికి గౌతమ బుద్దుడి జీవితంలో కూడా కీలక పాత్ర ఉందని వివరించారు. దేశమంతా తిరిగిన తర్ావత మూడు రోజులు ధ్యానం చేయడానికి వివేకానంద ఇక్కడే వచ్చారని, ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడే ఆయనకు అభివృద్ధి చెందిన భారతదేశం విజన్ కనిపించిందని చెప్తారు. భారతదేశ నిర్మాణం కోసం ఏం చేయాలన్నది ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడే వివేకానందకు బోధించబడిందని అంటారు.

Read More
Next Story