
మిస్టరీగా మారిన తల్లీ, పిల్లల ఆత్మహత్య కేసు
ఏ సమస్యా లేకపోయినా విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో అందరికీ పెద్ద పజిల్లాగ తీయారైంది
ఆర్ధిక ఇబ్బందులు లేవు..కుటుంబంలో ఎలాంటి కష్టమూలేదు..ఆఫీసులో కూడా సమస్యలు లేవు. అయినా ఒక తల్లి, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నది. ఇపుడీ కేసును ఛేదించటం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద స్ధాయిలోనే ఉద్యోగంచేస్తున్న(Vijayasanthi Suicide) విజయశాంతిరెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు చైతన్యారెడ్డి, విశాల్ రెడ్డి ముగ్గురూ చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక గూడ్స్ రైతు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త చెప్పిన వివరాల ప్రకారం కుటుంబానికి ఎలాంటి సమస్యలు లేవు.
ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆర్ధిక సమస్యలే ఎక్కువగా కారణమవుతుంది. లేకుంటే కుటుంబంలో కలహాలు, అత్త, మామల వేధింపులు, పిల్లలు లేకపోవటం ఇవేవీ కాకపోతే దీర్ఘకాల వ్యాధులు కూడా ఆత్మహత్యలకు కారణం అవుతుంటాయి. అయితే విజయారెడ్డి ఆత్మహత్యకు ఇవేవీ కారణాలు కావు. ఎందుకంటే వీళ్ళ కుటుంబం ఆర్ధికంగా పటిష్టంగానే ఉంది. ఉద్యోగంలో ఏమైనా సమస్యలు లేకపోతే వేధింపులు ఉన్నాయా అంటే అదీలేదు. తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని భర్త చెబుతున్నాడు. అత్త, మామల వేధింపులు కూడా లేవు. ముచ్చటగా ఇద్దరు పిల్లలున్నారు. ఏ సమస్యా లేకపోయినా విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో అందరికీ పెద్ద పజిల్లాగ తీయారైంది. తరచి చూస్తే ‘ఏ సమస్యా లేకపోవటం కూడా సమస్యేనా’ అన్న అనుమానం పెరిగిపోతోంది.
విషయం తెలుసుకుని హైదరాబాద్ చేరుకున్న ఆమె భర్త సురేంద్ర రెడ్డి ఆత్మహత్యకు కారణాలను చెప్పలేకపోతున్నాడు. భార్య, పిల్లల మధ్య ఏమి జరిగిందో తాను చెప్పలేకపోతున్నాడు. రెగ్యులర్ గా కుటుంబంలోని అందరితోను ఫోన్లో మాట్లాడుతునే ఉన్నట్లు తెలిపాడు. ఎప్పుడూ ఏ సమస్యా ఉన్నట్లు భార్య తనతో చెప్పలేదన్నాడు. విజయశాంతిరెడ్డి ఉపయోగించిన మొబైల్, ల్యాప్ టాప్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటిల్లో అయినా ఏమైనా కారణాలు తెలుస్తుందేమో చూడాలి. ఏడాదికి 1.50 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2024 ఏడాదితో పోల్చితే 2025లో ఆత్మహత్యలు పెరిగాయి. 7.5 శాతం నుండి 10.03 శాతం ఆత్మహత్యలు పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అన్నీ ఆత్మహత్యలకు ఏవో కారణాలుంటాయనటంలో సందేహంలేదు. మరి విజయశాంతిరెడ్డి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యకు కారణాలు ఏమయ్యుంటాయో ?

