లక్నోలో ఖామెనీ మృతికి సంతాపం..
x

లక్నోలో ఖామెనీ మృతికి సంతాపం..

ఇరాన్ నుంచి తెచ్చిన ‘‘కఫం’’ను పవిత్రంగా భావించే షియా ముస్లింలు..


Click the Play button to hear this message in audio format

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనీ ఫిబ్రవరి 28న క్షిపణి దాడిలో మరణించారు. ఆయన మృతికి భారతదేశంలోని షియా ముస్లింలు సంతాపం తెలిపారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఆయన హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన ప్రదర్శన చేపట్టారు.


లక్నో – "మినీ ఇరాన్"

ఇరాన్‌తో లక్నో నగరానికి ఉన్న అనుబంధం శతాబ్దాలది. అవధ్ నవాబుల కాలంలో ఈ బంధం మొదలైంది. అవధ్ నవాబ్ సాదాత్ అలీ ఖాన్, ఇరాన్ వంశానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనతో పాటు పర్షియన్ సంస్కృతి, కవిత్వం, మతాచారాలు, నిర్మాణశైలిలు లక్నోకు చేరాయి. ఈ ప్రభావం లక్నోలో స్పష్టంగా కనిపిస్తుంది.


ముహర్రం వేడుకలు, ఇరాన్ ప్రభావం..

లక్నోలో ముహర్రం వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే ఈ వేడుకల్లో ఇరాన్ సంప్రదాయాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇరాన్, ఇరాక్‌ మసీదులను పోలిన ప్రార్థనా స్థలాలు ఇక్కడ దర్శనమిస్తాయి.


ఇరాన్ నుంచి "కఫన్" తీసుకువ‌డం

లక్నోలోని షియా ముస్లింలు ఇరాన్ లేదా ఇరాక్‌కు వెళ్లినప్పుడు అక్కడి నుంచి కఫన్ (మృతదేహాన్ని కప్పే వస్త్రం) తీసుకువస్తారు. వారు పవిత్రంగా భావించే ఈ వస్త్రాన్ని శవపేటికపై కప్పడం ద్వారా చనిపోయిన వ్యక్తి పాపాలన్ని తొలగిపోతారని వారి నమ్మకం.


ఇరాన్‌లో షియా ఇస్లామిక్ విద్య..

లక్నో నగరంలోని చాలామంది యువకులు ఇరాన్‌లోని కోమ్ నగరానికి వెళ్లి షియా ఇస్లామిక్ విద్యను అభ్యసించారు. కొందరు అక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా భారత్‌లోని వారి కుటుంబసభ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లక్నో నగరానికి ఇరాన్‌తో ఉన్న సంబంధాలు కేవలం రాజకీయాలు కాకుండా చరిత్ర, సంస్కృతి, మతపర బంధాలు పెనవేసుకున్నాయి. అందుకే ఖామెనీ మరణంపై ఇక్కడి షియా ముస్లింలు సంతాపం తెలిపారు.

Read More
Next Story