75 శాతం ఉద్యోగుల్ని తీసేసిన డంజో డెలివరీ యాప్
x

75 శాతం ఉద్యోగుల్ని తీసేసిన డంజో డెలివరీ యాప్

ముఖేష్ అంబానీ భారీ పెట్టుబడులు పెట్టినా కంపెనీ కష్టాలుతీరలేదు


డంజో (DUNZO) అనెే కంపెనీ పేరు విన్నారుగా. ఇది పండ్లు కూరగాయలు, మందులు వంటి సరకులను ఇంటికి సరఫరా చేసే ప్లాట్ ఫామ్. హైపర్ లోకల్ డెలివరీ సర్వీస్ లో మంచి పేరు తెచ్చుకుంది. దానికి తో డు ఈ కంపెనీకి ముఖేష్ అబ ానీ మద్దతు ఉంది.అయినా సరే, ఈ కంపెనీ జాతకం మారలేదు. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనితో కష్టాలు మొదలయ్యాయి. చిరవకు 75 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించివేశారు. ఇపుడు కేవలం 50 మంది ఉద్యోగులు నామమాత్రంగా మిగిలిపోయారు.

ఇటీవలి దాకా డంజోకి మంచి పేరే ఉండింది. ఈ కంపెనీ విలువ రు. 6505 కోట్లు అన్నారు. ఇంతవిలువ లెక్కించినా పెట్టుబడులు రావడం లేదు. మొన్న జూలై ఏదో అమెరికన్ కంపెనీతో చర్చలు సాగుతున్నాయని, ఫండింగ్ వస్తుందని ఆశ పెట్టారు. ఆ డీల్ కుదర్లేదు. దీనితో కంపెనీ కష్టాలు బాగా ముదిరిపోయాయి. సిబ్బంది జీతాలు నిలిచిపోయాయి. ఎవరో ఒకరు పెట్టుబడి పెడతారని, అడబ్బు రాగానే జీతాలు చెల్లిస్తామని డుంజో చెబుతూ ఉంది.

ఈ కంపెనీ ప్రొఫైల్ చూసి 2023లో ముఖేష్ అంబానీ రు. 1679 కోట్లు పెట్టుబడి పెట్టి 25.8 శాతం వాటా కొన్నారు. ఇది పైకి పెద్ద మొత్తంగా కనిపించినా, ఈ డబ్బుతో డంజో కష్టాలు తీరలేదు.

డంజోన యాప్ ని 2014 లో కబీర్ బిశ్వాస్ అనే వ్యక్తి ప్రారంభించాడు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ చాలా తొందరగా డెలివరీ సర్వీస్ నెట్ వర్క్ ని విస్తరింపచేసింది,. ముంబై, బెంగళూరు, పుణే,గుర్ గావ్, ఢి్ల్లీ, చెన్నైలకు విస్తరించింది. కుటుంబానికి అవసరమయిన సరుకులన్నింటిని సప్లై చేసే యాప్ ఇది. అయితే, 2019 ఈ కంపెనీకి పెద్ద దెబ్బ తగిలింది. డేటా బ్రీచ్ అంటే వినియోగ దారుల సమాచారం లీక్ అయిందనే ఆరోపణ వచ్చింది. దీనితో 3.5 మిలియన్ యూజర్ల విశ్వాసం దెబ్బతినింది. అప్పటి నుంచి డంజో కోలుకో లేకపోతున్నది.

Read More
Next Story