ఇకనామిక్‌ ‌జోన్‌గా మూసి పరివాహక ప్రాంతం
x

ఇకనామిక్‌ ‌జోన్‌గా మూసి పరివాహక ప్రాంతం

మూసినది రూపురేఖలు మారుస్తారా? నదీ పరివాహక ప్రాంతం ఎంప్లాయ్‌మెంట్‌, ఇకనామిక్‌ జోన్‌గా మారబోతుందా? సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న మార్పులేంటి?


హైదరాబాద్‌లో మూసీనది (Musi River) ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి దాకా నది పరివాహకాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా తయారుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశం (Review meeting)లో ఆయన మాట్లాడారు. బ్రిడ్జిలు, హాకర్‌ జోన్లు, వాణిజ్య సమూదాయాలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేలా ప్లాన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైనచోట మురుగును శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

Read More
Next Story