మొదలైన మూసీ సుందరీకణ ప్రాజెక్టు పనులు
x
Land acquisition Notification released for Musi project

మొదలైన మూసీ సుందరీకణ ప్రాజెక్టు పనులు

భూయజమాలకు చట్టం ప్రకారం పరిహారం చెల్లించబోతున్నట్లు కూడా నోటిఫికేషన్లో కార్పొరేషన్ స్పష్టంచేసింది


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పనులు బుధవారం మొదలయ్యాయి. (Musi river development front)మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రంట్ కార్పొరేషన్ పనులకు శ్రీకారం చుట్టింది. (Golkonda) గోల్కొండ, గండిపేట మండలాల్లో భూ సేకరణకు బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. పై రెండు మండలాల్లో 50 ఎకరాలను సేకరించటమే లక్ష్యంగా కార్పొరేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది. భూయజమాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించబోతున్నట్లు కూడా నోటిఫికేషన్లో కార్పొరేషన్ స్పష్టంచేసింది. దాదాపు ఏడాదిగా ప్రకటనలకే పరిమితమైన మూసీనది(Musi Project) సుందరీకరణ ప్రాజెక్టు పనులకు ఈరోజు మొదటి అడుగుపడినట్లే అనుకోవాలి.

మూసీనది నగరంతో పాటు నల్గొండ జిల్లాలో సుమారు 57.5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువభాగం నగరంలోనే ఉంది. ఓల్డ్ సిటీలోని బహదూర్ పుర, చార్మినార్, యాకత్ పుర, మలక్ పేట, అంబర్ పేట్ నియోజకవర్గాల్లో మూసీనది విస్తరించుంది. దక్షిణకొరియా, సియోల్ నగరంలోని ‘చంగ్ యే చున్’ నది ప్రాజెక్టు లాగ మూసీని కూడా అత్యంత సుందరంగా, మంచినీటి నదిగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లక్ష్యం. అందుకనే దక్షిణకొరియాలోని చంగ్ యే చున్ నదిని ప్రత్యక్షంగా పరిశీలించాడు. అక్కడి నదిని సుందరంగా తీర్చిదిద్దటానికి అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధివిదానాలను తెలుసుకున్నాడు.

ఇక్కడ మూసీసుందరీకరణ ప్రాజెక్టును సుందరంగా తీర్చిదిద్దాలంటే రేవంత్ ముందు చాలా సవాళ్ళున్నాయి. అవేమిటంటే నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించటమే పెద్ద సమస్య. సుమారు 25 వేల ఎకరాలు నదికి రెండు వైపులా ఆక్రమణలకు గురయ్యాయి. రాజకీయపార్టీలతో పాటు వాటి అనుబంధ సంఘాలకు చెందిన నేతల ఆధ్వర్యంలో దశాబ్దాలుగా ఆక్రమణలు జరుగుతునే ఉన్నాయి. ఈ ఆక్రమణలన్నింటింకీ ప్రభుత్వం ఆమోదం ఉంది. ఎలాగంటే మూసీనదికి రెండువైపులా చాలా ఆక్రమణలు ఉన్నాయని తెలిసినా అందులోని నిర్మాణాలకు ప్రభుత్వ శాఖలే విద్యుత్ కనెక్షన్, మంచినీటి కనెక్షన్లు ఇచ్చాయి. అలాగే రోడ్లు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఆస్తిపన్నును కూడా వసూలుచేస్తోంది. విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ విద్యుత్, మంచినీటి కనెక్షన్లిచ్చి బిల్లులు కట్టించుకుంటున్నాయంటే ఆక్రమణలకు రాజముద్ర పడినట్లుగానే భావించాలి.

అందుకనే ఇపుడు నదికి రెండువైపులా ఆక్రమణలను తొలగించటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎవరిని ఇల్లు ఖాళీచేయించాలన్నా వెంటనే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు దూరిపోయి పెద్ద వివాదంగా మార్చేస్తున్నాయి. పోయిన ఏడాది కొన్నిఇళ్ళను ఖాళీచేయించేటపుడు బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు అక్కడచేసిన గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయినా అక్కడున్న ఇళ్ళల్లో సుమారు 250 ఇళ్ళవాళ్ళని ఖాళీచేయించి కూలగొట్టేసింది ప్రభుత్వం. అయితే ఇళ్ళని ఖాళీచేయటం ఇష్టంలేని వాళ్ళల్లో కొందరు కోర్టులో కేసులు వేయటంతో ఇళ్ళను ఖాళీచేయించే ప్రక్రియకు బ్రేకులుపడింది.

మూసీనది పొడవునా కేంద్రప్రభుత్వం అమృత్ పథకంలో 39 సీపేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేసి ఇపుడు నదిలో కలుస్తున్న మురికి, వ్యర్ధాలు, రశయనాలను కంట్రోల్ చేయాలన్న టార్గెట్ ను పెట్టుకున్నది. నదిలోకి వ్యర్ధాలు కలవకూడదంటే ముందు రెండువైపులా ఉన్న వాళ్ళని ఇళ్ళు ఖాళీచేయించాలి. ప్రభుత్వం అంచనా ప్రకారం రెండువైపులా అందరినీ ఖాళీచేయిస్తే సుమారు 25 వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలోకి వస్తుంది. ఇందులో 120 కోట్ల చదరపు అడుగుల స్ధలంలో వర్తక, వాణిజ్య కాంప్లెక్సులు, ఎంటరై టైన్మెంట్ పార్కులు, మాల్టీ ప్లెక్సులు, వాకింగ్ ట్రాకులు, పార్కులు, స్కైవాక్ తదితరాలను ఏర్పాటుచేయాలని రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

రేవంత్ మూసీనది సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించగానే బీఆర్ఎస్, బీజేపీ ప్రాజప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా ఏదైనా ప్రాజెక్టు టేకప్ చేయలంటే తప్పకుండా హిడెన్ అజెండా ఉండాల్సిందే అన్నట్లుగా తయారైంది. అందుకనే మూసీ ప్రాజెక్టు పేరుతో రేవంత్ రు. 25 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్, బీజేపీ కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి పదేపదే ఆరోపించారు. వీళ్ళ ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో తెలీదుకాని ప్రాజెక్టయితే బాగా వివాదాస్పమైపోయిది కోర్టులో కేసులు దాఖలవ్వటంతో పనులపైన స్టే వచ్చేసింది. దాంతో అప్పట్లో పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.

ఇంతకాలానికి ప్రభుత్వం గోల్కొండ, గండిపేట మండలాల్లో భూసేకరణకు నోటిపికేషన్ జారీచేసింది. గోదావరి జలాలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మూసీలోకి తరలించటం ద్వారా నదిని మంచినీటి నదిగా తీర్చిదిద్దాలన్నది రేవంత్ టార్గెట్. ఇందుకు మాత్రమే సుమారు రు. 5600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది ప్రభుత్వం. ఈ పని జరగాలంటే ముందు రెండువైపులా ఉన్న ఇళ్ళని ఖాళీచేయించాలి, తర్వాత ఇందులోకి వస్తున్న రకరకాల వ్యర్ధాలను అడ్డుకోవాలి. వ్యర్ధాలను అడ్డుకుని ట్రీట్మెంట్ ప్లాంట్లను పెట్టి నీటిని శుద్దిచేస్తేకాని ఇపుడున్న కంపు వదలదు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం రేవంత్ కేంద్రప్రభుత్వాన్ని, బ్యాంకులను, ఆర్ధికసంస్ధలను సంప్రదిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story