మా తాత స్కూటర్ మీద తిప్పాడు, నేను విమానంలో తిప్పుతున్నా!
x
పైలెట్ కుటుంబ సభ్యులు (ఫోటో కర్టసీ ఇన్ స్టా గ్రామ్)

మా తాత స్కూటర్ మీద తిప్పాడు, నేను విమానంలో తిప్పుతున్నా!

పిల్లలు పుట్టినపుడు కాదు వాళ్లు ప్రయోజకులు అయినపుడు, పది మందిలో తల్లిదండ్రులను కీర్తించినపుడు వచ్చే కిక్ ఎలా ఉంటుందో చూడండి..


పిల్లల్ని కన్నప్పుడు కాదు వాళ్లు తమ సొంత తెలివితేటలతో విజయతీరాలను తాకినపుడు ఆ తల్లిదండ్రులకు ఉండే తృప్తి, ఆనందమే వేరు. సరిగ్గా సినిమాల్లో మాదిరి ఇక్కడో యువకుడు కష్టపడి చదివి పైలెట్ అయి తను నడిపే విమానంలో తన వాళ్లను తీసుకువెళితే అప్పుడొచ్చే కిక్కే వేరు. ఈ విమానంలో ‘నేను నాతో పాటు నన్ను కనిపెంచిన మా అమ్మ, మా తాత, మా అమ్మమ్మ ఉన్నారు, వాళ్లను మీకు పరిచయం చేస్తానని’ ఆ పైలెట్ మైకులో అనౌన్స్ చేసి తోటి ప్రయాణీకులకు వారిని పరిచయం చేస్తే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో, మీరే ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ ప్రకటన వినడంతోనే ఏ తల్లితండ్రులకైనా ఆనంద భాష్పాలు రాలవా, తీవ్ర భావోద్వేగానికి గురికారా! అబ్బా, నా పిల్లలు సాధించార్రా అని గొప్పగా మురిసిపోతామా లేదా.. సరిగ్గా ఇప్పుడదే జరిగింది. తమిళనాడుకు చెందిన ప్రదీప్ కృష్ణన్. ఓసాదాసీదా కుటుంబంలో పుట్టారు. పైలెట్ కావాలన్న తన కోర్కెను తీర్చుకున్నారు. తన కుటుంబాన్నిసంతోషంలో ముంచెత్తారు. తన కుటుంబ సభ్యులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.

ప్రదీప్‌ కృష్ణన్‌ తాను నడిపే విమానంలో ప్రయాణిస్తున్న తల్లి, అమ్మమ్మ, తాతయ్యను తోటి ప్రయాణీకులకు పరిచయం చేస్తూ వారిని ఉబ్బితబ్బిబ్బు చేశారు. ఈ ఆనందాన్ని తట్టుకోలేక ఆయన తల్లి కంట బొటబొటా నీరాగలేదు. అందర్నీ హృదయాలను చలింపచేసిన ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. పైలెట్ ప్రదీప్ కృష్ణన్ నే ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.

అందులో ఏముందంటే.. ‘‘చెన్నై- కోయంబత్తూరు విమానంలో ఈరోజు మా అమ్మ, తాత, బామ్మ నాతో కలిసి ప్రయాణిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మా తాత ఈ రోజే మొదటిసారి నాతో విమానంలో ప్రయాణిస్తున్నారు. నా చిన్నప్పుడు ఆయన నన్ను ఎన్నో సార్లు తన స్కూటర్‌పై తిప్పారు. బదులుగా ఇప్పుడు ఆయన్ను విమానంలో ఎక్కించుకున్నాను’’ అని కెప్టెన్‌ ప్రదీప్‌ కృష్ణన్‌ తన అనౌన్స్‌మెంట్‌లో సరదాగా చెప్పారు. తన కుటుంబ సభ్యులను ప్రయాణికులకు పరిచయం చేశారు. ఈ భావోద్వేగ క్షణంతో వారి కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. ‘కుటుంబం, స్నేహితులతో కలిసి విమాన ప్రయాణం చేయడం అనేది ప్రతి ఒక్క పైలట్‌ కల’ అని కామెంట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఆ పైలెట్ కు జేజేలు పలుకుతున్నారు. ‘‘మీ కుటుంబ సభ్యులు ఎంతో గర్వపడుతున్నారు’’ అని ‘‘మీరు చాలా గ్రేట్.. మీ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తారు. మీ అమ్మ కోర్కె తీర్చారు’’ అని మరొకరు ఇలా నెటిజన్లుస్పందిస్తున్నారు. ఈ వీడియో కుటుంబ మాధుర్యాన్ని కళ్లకు కట్టిందని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు. ఇలా వేలాది మంది స్పందిస్తున్నారు.

Read More
Next Story