అలీగడ్ యూనివర్శిటీలో ‘నారీశక్తి’ నాటకం..ఏమిటంటే...
x

అలీగడ్ యూనివర్శిటీలో ‘నారీశక్తి’ నాటకం..ఏమిటంటే...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం వర్సిటీ వీసీగా నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. వందేళ్ల చరిత్రలో ఈ వర్సిటీకి మహిళా వీసీని నియమించడం ఇదే తొలిసారి.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం వర్సిటీ వీసీగా నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. వందేళ్ల చరిత్రలో ఈ వర్సిటీకి మహిళా వీసీని నియమించడం ఇదే తొలిసారి.రాష్ట్రపతి ఆమోదం అనంతరం విద్యాశాఖ ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు సోమవారం తెలిపారు. వాస్తవానికి చాలా నెలల నుంచి ఈ పోస్టును భర్తీ చేయలేదు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ప్రధాని మోదీ అలీఘర్‌లో పర్యటించిన రోజున కొత్త వైస్-ఛాన్సలర్‌ నియమించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వీసీ నియామకానికి ప్రభుత్వం ఎన్నికల సంఘం (EC) అనుమతి కూడా తీసుకుంది.

వాస్తవానికి ఈ పోస్టుకు ముగ్గురు పోటీ పడ్డారు. ఇద్దరు పురుషులను పక్కన పెట్టి మహిళకు ప్రాధాన్యం ఇచ్చారు. మోదీ ఇప్పటికే తన ఎన్నికల ప్రచారంలో నారీ శక్తి'(మహిళా శక్తి) గురించి ప్రస్తావిస్తున్నారు. అత్యున్నత పదవుల్లోనూ మహిళలకు స్థానం కల్పిస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్రపతి పదవికి కూడా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

వీసీ నియామకంపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. తదుపరి విచారణ ఏప్రిల్ 29న జరగనుంది. కేసు విచారణలో ఉన్నా వీసీ నియామకం చేపట్టడం గమనార్హం.

ఖాతూన్ మహిళా కళాశాల మాజీ ప్రిన్సిపాల్. ఈమె నియామకానికి ముందు విశ్వవిద్యాలయం తాత్కాలిక VCగా ప్రొఫెసర్ మొహమ్మద్ గుల్రేజ్ పనిచేశారు.ఈయన భార్యే ప్రస్తుత వీసీ. గత ఏడాది ఖాతూన్ భర్త అధ్యక్షతన సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్.. వీసీ పదవికి ముగ్గురి పేర్లలో ఖాతూన్‌ను ఎంపిక చేసింది. న్ని సవాల్ చేస్తూ 2023లో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది. AMU పాలకమండలిలోని కొంత మంది సభ్యులు ఖాటూన్ ఎంపికకు వ్యతిరేకంగా నోట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నప్పుడు ఖాతూన్‌ను వీసీగా నియమించాలనే ప్రభుత్వ ఎత్తుగడ, EC ఆమోదాన్ని కోర్టులో లేవనెత్తే అవకాశం ఉంది. వీసీ నియామకానికి అభ్యంతరం లేదని ఏప్రిల్ 9న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు తెలిపింది. ఈ నియామకాన్ని “పబ్లిసిటీ” లేదా “రాజకీయ మైలేజీ” కోసం వాడుకోకూడదని కూడా EC పేర్కొంది.

హడావుడిగా అపాయింట్‌మెంట్..

ఏప్రిల్ 23, 2023న ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ రిటైరయ్యారు. ఆ తర్వాత నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.తారిఖ్ పదవీ విరమణకు సుమారు నెల ముందు మన్సూర్ గుల్రెజ్‌ను ప్రో-వైస్-ఛాన్సలర్‌గా (PVC) నియమించారు.దీంతో గుల్రేజ్ తన భార్యను వీసీగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. తర్వాత మన్సూర్ జేపీలో చేరి ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయ్యారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కూడా. ఈ కేసును జనవరి 9న హైకోర్టు విచారించింది. వీసీ నియామకంపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఖాతూన్ విషయంలో ఎంత త్వరగా స్పందించిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story