
జీహెచ్ఎంసీకి కౌంటర్ అదిరిపోయిందిగా !
మెయింటెయిన్ చేయడానికి, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి అసలు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అని ప్రశ్న
గుడిమల్కాపూర్ హోల్‌సేల్ మార్కెట్ విషయంలో జీహెచ్ఎంసీకి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. గుడిమల్కాపూర్ మార్కెట్‌కు భారీ చరిత్ర ఉందని, చాలా పెద్దదంటూ జీహెచ్ఎంసీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. జీహెచ్ఎంసీ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే ఓ నెటిజన్ దానికి అదిరిపోయే కామెంట్ పెట్టాడు. మీరు చూపిస్తున్న పరిశుభ్రమైన మార్కెట్ ప్రతిరోజూ ఉండదని, సాధారణంగా అత్యంత అపరిశుభ్రంగా కనిపిస్తుందని ఫోటో షేర్ చేశాడు. దాంతో పాటు దానిని మెయింటెయిన్ చేయడానికి, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి అసలు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అని ఎక్స్ వేదికగా క్వశ్చన్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు.
గుడిమల్కాపూర్ చరిత్ర ఏంతో తెలుసా?
తెలంగాణలోని అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అయిన గుడిమల్కాపూర్ మార్కెట్‌కు సుమారు శతాబ్దపు చరిత్ర ఉంది. గుడిమల్కాపూర్ కేవలం పూల మార్కెట్ మాత్రమే కాదు. ఇది ఒక హోల్సేల్ కేంద్రం, ఇక్కడ ప్రతీ రోజు అనేక వ్యాపారాలు, జీవనాధారాలు, పలు తరాల వ్యాపారులు కలిసి పని చేస్తారు. ఈ హోల్సేల్ మార్కెట్ 1935లో నిజాం యుగంలో జంబా ఘ్ (మొజ్జం జాహీ మార్కెట్ సమీపం) వద్ద ప్రారంభమైంది. హైదరాబాద్ విస్తరణతో, 2009లో గుడిమల్కాపూర్ హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్కు మార్చబడింది. ఈ మార్పు వల్ల వ్యాపారం సక్రమంగా, మెరుగైన ప్రాప్తితో, విస్తృతమైన మార్కెట్ కార్యకలాపాలతో కొనసాగుతుంది.
ప్రస్తుతానికి, 8 ఎకరాల విస్తీర్ణంలో, మార్కెట్ వివిధ రకాల వ్యాపార వ్యవస్థకు మద్దతు ఇస్తోంది:
- 195 హోల్సేల్ పువ్వుల దుకాణాలు
- 500 రిటైల్ కూరగాయల స్టాల్స్
- 13 మార్కెట్ హాళ్లు, రైతులు, వ్యాపారులకు సేవలు అందించడానికి
- సీజనల్ విక్రేతలు, ప్రతిరోజూ మార్కెట్ కార్యకలాపాలను సమృద్ధి చేయడానికి
ఈ చురుకైన మార్కెట్‌కు చరిత్రాత్మక లోతును ఇచ్చేది 19వ శతాబ్దపు కుమందన్ బౌళి పునరుద్ధరణ. ఇది మార్కెట్ పరిధిలో ఉంది, ఆధునిక వ్యాపారాన్ని హైదరాబాద్ నీటి వారసత్వంతో మళ్లీ కలుపుతోంది. గుడిమల్కాపూర్, వివిధ వ్యాపారాలు మరియు వారసత్వం కలిసిన అత్యంత ప్రత్యేకమైన నగర స్థలంగా నిలుస్తుంది. ఇది సిటీలోని హోల్సేల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను కొనసాగిస్తూ వృద్ధి చెందుతోంది.

