బైకర్లు బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే మీదకు వెళ్లొద్దంటున్న NHAI
x
ఇలాంటి సాహసం వల్లే ప్రాణాలు పోతున్నాయి

బైకర్లు బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే మీదకు వెళ్లొద్దంటున్న NHAI

నిషేధం లెక్క చేయకుండా ఎక్స్‌ప్రెస్‌వే ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న యువకులు



కర్ణాటకలోని బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే (Bengaluru–Chennai Expressway, or National Expressway 7 (NE-7) స్ట్రెచ్ మీద ద్విచక్ర వాహనాలను నడపడం నిషేధించారు. కోలార్ జిల్లాలోని బంగార్‌పేట తాలూకాలో ఆదివారం రాత్రి జరిగిన ఒక పెద్ద ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తెలిపింది.

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే మీద ద్విచక్ర వాహనాలు తిరగడం నిషేధం కాబట్టి ఇకనుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాటిని ఆపేయాలని NHAI పెట్రోలింగ్ వాహనాలను ఆదేశించింది. ఈ నిషేధం గురించి రైడర్లకు తెలియజేయడానికి సైన్ బోర్డులు ఏర్పాటుచేయాలని కూడా నిర్ణయించింది.

"ఆదివారం నాడు ఒక బైక్ ఎక్స్‌ప్రెస్‌వేలోకి రాంగ్ డెరెక్షన్ లో ప్రవేశించింది. వెంటనే ఎదరుగా వస్తున్న నాలుగు చక్రాల వాహనాన్ని ఢీకొట్టింది. దీనితో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు,” NHAI అధికారి మీడియాకు చెప్పారు.

దేశంలోని ఎక్స్‌ప్రెస్‌వేలలో బైక్‌ నడపడం మీద ఇప్పటికే నిషేధం ఉంది. ద్విచక్ర వాహనదారులు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఉపయోగించకూడదు అయితే, నిషేధం ఉల్లంఘించి అపుడపుడు ఇలాఎక్స్ ప్రెస్ వేల మీదకి బైక్ లు ప్రవేశిస్తున్నాయి. 120 కి.మీ ఎక్స్‌ప్రెస్‌వేలు గరిష్ట వేగంతో నడపడానికి ఎక్స్ ప్రెస్ వేలను రూపొందించారు.

“ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఇలా అధిక వేగంతో వెళ్ళ తున్నప్పుడు బైకర్లు ఈ ఎక్స్ ప్రెస్ వే మీదకు ప్రవేశించడం, ఈ స్ట్రెచ్‌ను ఉపయోగించడం సురక్షితం కాదు. ఇది హైస్పీడ్ స్ట్రెచ్ కాబటి ప్రమాదం జరిగేందుకు అవకాశం ఎక్కువ. ఇలా దూరితే బైకర్లు తమ ప్రాణాలనే కాదు, ఇతర రహదారి వినియోగదారుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేసిన వారవుతారు,” అని ఆయన అన్నారు.

ఈ ఎక్స్ ప్రెస్ వే స్ట్రెచ్‌ను వాహనదారుల కోసం అనధికారికంగా తెరిచారు. అయితే, చాలా మంది బైకర్లు ఇదే అనువుగా తీసుకుని కొత్త అనుభవం కోసం స్ట్రెచ్ మీదకు వస్తున్నారు. దీనితో ప్రమాదాలు జరుగుతున్నాయి

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే కర్ణాటకలో 68 కి.మీ.ల పొడవున ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను గత నెలలో అనధికారికంగా ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గుండా వెళుతున్న మిగిలిన 260 కి.మీ. ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే కర్ణాటకలోని హోస్కోట్, మాలూర్, కెజిఎఫ్ వంటి కీలక ప్రాంతాలను కలుపుతుంది.



Read More
Next Story