
బడ్జెట్ 2026-27: ఏది చౌక, ఏది ఖరీదవుతుంది
పేదల బొగ్గుపై సుంకం. మధ్య తరగతి వాళ్లు మైక్రోవేవ్ ఓవెన్లు, వీడియో గేమ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, విదేశీ ప్రయాణం, విద్య చౌక
నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదన వల్ల ఆర్థికంగా, బలహీన వర్గాలు వంట ఇతర ప్రయోజనాల కోసం తరచుగా ఉపయోగించే బొగ్గుపై 2026 కేంద్ర బడ్జెట్‌లో సుంకం పెరిగింది.అయితే మైక్రోవేవ్ ఓవెన్లు, వీడియో గేమ్‌లు, విదేశీ ప్రయాణం, విద్య వంటి అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు చౌకగా లభించే అవకాశం ఉంది. అంటే పేదలు భారం భరించినా మధ్యతరగతి, లేదా ఎగువ మధ్యతరగతి వారు సంతోషిస్తారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదవ బడ్జెట్ లో క్యాన్సర్ తో బాధపడే వారికి భారీ ఉరట లభించింది. క్యాన్సర్ చికిత్సలో వాడే 17 ముఖ్యమైన ఔషధాల దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. ఇది క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే నిర్ణయం. కాన్సర్ ఔషధాలు చౌక అవుతాయి.. అణు విద్యుత్ ప్రాజెక్టు దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా 2035 వరకు మినహాయించారు, ఇది ఈ రంగానికి ఊతం ఇచ్చింది. అయితే, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఆ ప్రతిపాదనల జోలికి వెళ్లకపోవడం ఈ బడ్జెట్ లో ఒక వింత.
ఏది చౌకగా దొరుకుతుంది?
- విదేశీ టూర్ ప్యాకేజీలు
- విదేశీ విద్య
- క్యాన్సర్ మందులు
- ఆల్కహాలిక్ లిక్కర్ స్క్రాప్, కొన్ని ఖనిజాలు
- పాదరక్షలు, తోలు వస్తువులు
- శక్తి పరివర్తన పరికరాలు
- మైక్రోవేవ్ ఓవెన్లు, భాగాలు
- టీవీ భాగాలు
- కెమెరాలు, భాగాలు
- వీడియో గేమ్‌ల తయారీ భాగాలు
- కాఫీ, ఇతర వెండింగ్ యంత్రాలు
ఏది ఖరీదైనదవుతుంది?
- ఆదాయపు పన్నును తప్పుగా నివేదించినందుకు జరిమానా (ఇప్పుడు పన్ను మొత్తంలో 100 శాతం)
- చరాస్తులను వెల్లడించనందుకు జరిమానా
- స్టాక్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఖర్చులు
- బొగ్గు

