బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్‌ కుమార్‌
x

బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్‌ కుమార్‌

నితీష్‌ కుమార్ ఈ రోజు ఉదయమే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. సాయంత్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


జేడీ(యూ) అధినేత కొద్ది సేపటి క్రితం బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్‌ రాజేంద్ర అర్లెకల్‌ ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు విజయ్‌ కుమార్‌ సిన్హా, సామ్రాట్‌ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ రోజు (జనవరి 28 ) ఉదయమే నితీష్‌ తన రాజీమామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మహాఘట్‌బంధన్‌, భారత కూటమిలో తాను భావించినట్లుగా జరగట్లేదని కామెంట్‌ చేశారు. 18 నెలల కిందటే తాను విడిచిపెట్టిన బీజేపీతోనే తిరిగి జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 74 సంవత్సరాలు నితీష్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఇది తొమ్మిదో సారి.

నితీష్‌తో పాటు మరో 8 మంది..

నితీష్‌తో పాటు మరో 8 మంది మంత్రులుగా గవర్నర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు.

జేడీయూ నుంచి విజయ్‌ కుమార్‌ చౌదరి, విజయేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, శ్రవణ్‌ కుమార్‌ మంత్రులుగా ఎంపికయ్యారు. హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా నుంచి సంతోష్‌ కుమార్‌, సుమన్‌కు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. నితీశ్‌ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌ భవన్‌లో గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మహాగఢ్‌ బంధన్‌ కూటమి నుంచి వైదొలగి ఎన్డీయేతో చేతులు కలిపారు నితీష్‌ కుమార్‌.

Read More
Next Story