No detention దేశవ్యాప్తంగా 5, 8 తరగతులకు 'నో డిటెన్షన్' విధానం రద్దు
నూతన విద్యావిధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 5,8వ తరగతులకు పరీక్షలు ఉండాల్సిందేనని ప్రకటించింది.
నూతన విద్యావిధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 5,8వ తరగతులకు పరీక్షలు ఉండాల్సిందేనని ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ తరగతుల్లో తప్పినా ఆ తర్వాతి తరగతులకు ప్రమోట్ చేసే నో డిటెన్షన్ విధానం ఉంది. ఇకపై ఆ విధానం ఉండదు. ఈ తరగతుల్లో కూడా తప్పని సరిగా పరీక్షలు రాసి పాస్ కావాల్సిందే. ఇది ఇకపై దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది.
5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో డిటెన్షన్ విధానం’ (No-detention policy) రద్దు చేసింది. దీంతో ఇకపై సంవత్సరాంతపు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. పాస్ కాకపోతే 5,8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుంది. విద్యాహక్కు చట్టానికి 2019 మార్చిలో చేసిన సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ఇచ్చింది. దీని ప్రకారం పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ రీ-ఎగ్జామ్లోనూ ఫెయిల్ అయితే.. సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుంది.
పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం.అందువల్ల ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే 16 రాష్ట్రాలు, ఢిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశాయి. హరియాణా, పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగతా రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అధికారి తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం డిటెన్షన్ విధానం (వార్షిక పరీక్షల్లో ఫెయిలైతే తిరిగి అదే తరగతిలో చదివేలా చేయడం)పై గతంలో రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ‘నో డిటెన్షన్ విధానం’ కొనసాగుతోంది.
Next Story