‘‘ఎంతమందిని తొలగించినా ఎన్నికల్లో విజయం మాదే’’
x
మమతా బెనర్జీ

‘‘ఎంతమందిని తొలగించినా ఎన్నికల్లో విజయం మాదే’’

ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ‘సర్’ వల్ల 90 లక్షల ఓటర్లను తొలగించారని, కానీ దానివల్ల టీఎంసీపై ఎలాంటి ప్రభావం పడదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా టీఎంసీ నాలుగోసారి గెలుస్తుందని జోస్యం చెప్పారు.

న్యాయపరమైన వివాదం..

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మీనాఖాన్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తొలగించబడిన ఓటర్ల పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చడానికి తమ పార్టీ కోర్టును ఆశ్రయిస్తుందని టీఎంసీ అధినేత్రి తెలిపారు.
"బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మీరు 90 లక్షలకు పైగా ప్రజల పేర్లను తొలగించారు, కానీ మేమే గెలుస్తాం," అని బెనర్జీ అన్నారు. బెంగాల్ ప్రజల హక్కులు, గుర్తింపును కాపాడటానికి ఓటర్లు అప్రమత్తంగా ఉండి, ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలని కోరుతూ, ముఖ్యమంత్రి ఈ ఎన్నికలను "ప్రజల మనుగడ కోసం, బెంగాల్ అస్తిత్వం కోసం జరిగే పోరాటం"గా అభివర్ణించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడినందుకు ప్రజలు వేధింపులకు గురవుతున్నారని, ఆ పార్టీ బెంగాలీ భాషను విదేశీ భాషగా పేర్కొంటూ, బెంగాలీ మాట్లాడేవారిని చొరబాటుదారులుగా ముద్ర వేస్తోందని ఆమె ఆరోపించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడినందుకు ప్రజలు వేధింపులకు గురవుతున్నారని, ఆ పార్టీ బెంగాలీ భాషను విదేశీ భాషగా పేర్కొంటూ, బెంగాలీ మాట్లాడేవారిని చొరబాటుదారులుగా ముద్ర వేస్తోందని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు.

బీజేపీపై దాడి, భవిష్యత్ హెచ్చరిక

అదే జిల్లాలోని పాల్టాలో జరిగిన మరో ర్యాలీలో మాట్లాడిన మమతా బెనర్జీ.. "బీజేపీ తన ర్యాలీలలో పాల్గొనడానికి ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున చెల్లిస్తోంది" అని ఆమె పేర్కొన్నారు. కాషాయ పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూ, "ఆగస్టు 2026 నుంచి బీజేపీ పతనం అనివార్యం" అని ఆమె అన్నారు.
"బెంగాల్‌ను మూడు భాగాలుగా విభజించడానికి వారు (బీజేపీ) డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేస్తున్నారు" అని కూడా ఆమె ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను 'మోటా భాయ్' అని పిలిచినా ఆమె, దర్యాప్తు సంస్థల ద్వారా ప్రజలను బెదిరించారని ఆమె ఆరోపించారు. ఓటర్ల హక్కులను, రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడటానికి తమ పార్టీ రాజకీయంగా, చట్టపరంగా పోరాటం కొనసాగిస్తుందని బెనర్జీ పునరుద్ఘాటించారు.
Read More
Next Story