ఇకముందు క్రికెట్ లో స్లెడ్జింగ్ ఉండదు: వార్నర్
x
డేవిడ్ వార్నర్

ఇకముందు క్రికెట్ లో స్లెడ్జింగ్ ఉండదు: వార్నర్

స్లెడ్జింగ్ చేయడం ఇకముందు ముందు క్రికెట్ ఆటలో వీలుకాదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డారు. అలా ఎందుకనో కూడా వివరించారు..


క్రికెట్ ప్రపంచంలో భవిష్యత్ లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ ఉండదని ఆస్ట్రేలియా తాజా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్, బిగ్ బాష్ వంటి అనేక లీగ్ క్రికెట్ లు జోరుగా సాగుతున్నాయని, ఆటగాళ్లలందరూ డ్రెస్సింగ్ రూమ్ లో వారి అనుభవాలను పంచుకుంటున్నారని తెలిపారు. అందువల్ల ఆటగాళ్ల మధ్య మంచివాతావరణం ఉంటుందని, అందువల్ల స్లెడ్జింగ్ కు అవకాశమే ఉండదని అభిప్రాయపడ్డారు.

క్రికెట్ నుంచి రిటైరయ్యాక పెద్దగా ప్రణాళికలు ఏం లేవని, ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా గడుపుతానని చెప్పారు. అయితే భవిష్యత్ లో మాత్రం కోచ్ అవుతానని తన కోరికను వెల్లడించారు. రిటైర్ అయ్యాక ఓ టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. " అవును, నాకు కోచ్ గా పని చేయాలని ఉంది. అది కచ్చితంగా నెరవేరుతుంది" అని మీడియాతో చెప్పారు.

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్ తో జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. వార్నర్ జనవరి 1నే తన వన్డే కెరీర్ కు కూడా రిటైర్ మెంట్ ప్రకటించారు. కేవలం టీ20 మాత్రమే అందుబాటులో ఉంటానని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని టీ20 లీగ్ ల్లో కూడా ఆడతానని నిర్ణయించుకున్నాడు.

అయితే కోచ్ గా పని చేయాలనుకుంటే మాత్రం ముందు తన భార్య అనుమతి తీసుకుంటానని, ఆమె ఓకే అంటేనే వెళ్తానని చెప్పాడు.

ఆటగాడిగా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నా పని ప్రత్యర్థి ఆటగాళ్ల లయను దెబ్బతీయడంగా ఉందని, అందుకే అలా ప్రవర్తించానని వార్నర్ చెప్పుకొచ్చారు. అయితే దాని వల్ల ప్రజలు అప్ సెట్ అయ్యేవారని, అది వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించేదని వివరించారు. అయితే ఐపీఎల్ లాంటి లీగ్ ల వల్ల అది ఇక సాధ్యంకాదని చెప్పారు. మొన్న పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో షాహీన్ ఆఫ్రిది బౌలింగ్ సందర్భంగా జరిగిన ఓ చిన్న నవ్వు, పరిహసం లాంటివి ఉంటాయని పేర్కొన్నారు.

"అయితే నేను మాత్రం పాత వార్నర్ గా మాత్రం ఉండను. అప్పటి దూకుడు, స్లెడ్జింగ్ ఇక నా నుంచి కనిపించవు" అని వివరించారు. అయితే ఆటలో గెలుపే ముఖ్యం. విజయం సాధిస్తే ఏవీ గుర్తుకు రావు అని చెప్పారు.

వార్నర్ కెరిర్ ప్రారంభంలోనే ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్ చేయమని కోచింగ్ సిబ్బంది అతడికి సూచించారని ఆస్ట్రేలియా మరో ఓపెనర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజ వెల్లడించారు. అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన బాల్ టాంపరింగ్ కుంభకోణంతో మా జట్టు వైఖరి మొత్తం మారిందని ఖవాజ కొన్ని రోజుల కింద వెల్లడించారు.

కాగా వార్నర్ తన టెస్ట్ కెరీర్ లో 8,786 పరుగులు సాధించాడు. అందులో 26 సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అన్ని పార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన పాంటింగ్(27,368) తరువాత వార్నరే రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వార్నర్ కు తెలుగు రాష్ట్రాల్లో సైతం అభిమానులు ఉన్నారు. తెలుగులోని పాపులర్ సినిమా పాటలు, డైలాగ్ లు వార్నర్ నోట పలికి, అవి కాస్త సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ గా మారాయి.

Read More
Next Story