పొత్తుల్లో ఎత్తులు, చిత్తులు : ఒదిషాలో వెనక్కి తగ్గింది ఎవరు?
x

పొత్తుల్లో ఎత్తులు, చిత్తులు : ఒదిషాలో వెనక్కి తగ్గింది ఎవరు?

ఒదిషాలో బీజేపీ- బీజేడీ పొత్తు ఎందుకు విచ్చిన్నం అయింది. ఒకరు స్వల్పకాలిక లాభం కోసం పొత్తు పెట్టుకోవాలని చూడగా, మరొకరు దీర్ఘకాలిక లాభం కోసం పొత్తును వద్దను..


ఉత్కళ తీరంలో ఎన్నో నెలలుగా తెరవెనకు జరుగుతున్న సీట్ల చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటి వరకూ అన్ని శుభశకునములే అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా కమల దళం బీజేడీ మధ్య స్నేహం పగుళ్లులిచ్చింది. వచ్చే ఎన్నికల్లో మొత్తం 21 ఎంపీ స్థానాల్లో, అలాగే 147 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని బీజేపీ ఒడిశా అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

దీంతో బీజేడీ- బీజేపీ పొత్తు విషయాలు పక్కకి తప్పుకున్నాయి. అన్ని కుదిరాయి ఇక ఒప్పందమే తరువాత అనుకుంటున్న తరుణంలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పార్టీని బీజేపీ విడిచిపెట్టింది. ఎన్డీఏకి నవీన్ పట్నాయక్ ను చేర్చుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా 400 కు పైగా స్థానాలను సాధించాలని బీజేపీ మొదటగా భావించింది.
ఈ పొత్తు వల్ల తాత్కలికంగా లాభం చేకూరవచ్చు గానీ, దీర్ఘకాలంలో భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పార్టీ నాయకత్వం గ్రహించింది. దీనితో ఆఖరి నిమిషంలో పొత్తుకు రాంరాం చెప్పింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేడీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది బీజేపీనే. దీనితో అధికార, ప్రతిపక్షాలు కలిసి పోటీ చేస్తే భవిష్యత్ లో మరోపార్టీ బలపడే సూచనలు ఉండడంతో బీజేపీ వెనక్కి తగ్గింది.
ప్రజల నుంచి మద్దతు కొల్పోతామనే భయం ఇరు నేతల్లో నెలకొనడం, నైతికత విషయంలో ఒకసారి ఒక మచ్చ పడితే అది అలాగే కొనసాగుతుంది. దీనితో ఎవరూ పొత్తుకోసం ధైర్యం చేయలేకపోయారు. అలాగే అధికారాల పంపిణీ విషయంలో కూడా ఇరువురు నేతలు సంతృప్తిగా లేరు. పట్నాయక్ విశ్వసనీయ సహాయకుడు, BJD సెకండ్-ఇన్-కమాండ్ VK పాండియన్‌, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇరువురు పొత్తును వ్యతిరేకించారు.
BJD-BJP బంధం
గతనెలలో బీజేపీకి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ అశ్విని వైష్ణవ్ ను రాజ్యసభ సభ్యుడిగా నిలబెట్టింది. ఒదిషాలో రైల్వే సదుపాయాలను మెరుగుపరచాలనే షరతుతో బీజేడీ దీనికి మద్ధతు తెలిపింది. ఇప్పుడు దీనికి ప్రతిఫలం బీజేపీ చెల్లించాలని ఒదిషా అధికారపార్టీ భావిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నికై, మరో రెండు నెలల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే రైల్వే మంత్రిగా వైష్ణవ్ కొనసాగుతారనే గ్యారెంటీ ఏమైనా ఉందా అనే దానిపై బిజెడి వివరణ ఇవ్వలేదు. ' వైష్ణవ్‌కి మళ్లీ మంత్రి పదవి ఇవ్వకుంటే ఏమవుతుంది, లేదా మరో మంత్రి పదవి దక్కుతుందా అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. వాస్తవానికి ఇబ్బందికరంగా ఉన్నా, పట్నాయక్, పాండియన్ బిజెపి, బిజెడి మధ్య బంధుత్వంపై తమ విశ్వాసాన్ని తగ్గించుకున్నారు.
పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం తీసుకున్న దాదాపు అన్ని బిల్లులకు BJD మద్దతు ఇచ్చింది. నోట్ల రద్దు నుంచి ఆర్టికల్ 370 రద్దు వరకు వీరి బంధం అప్రహతితంగా కొనసాగింది. అలాగే ఒడిశాలో బీజేపీతో రహస్య అవగాహన పట్నాయక్‌కు సాఫీగా పాలనను అందించిందనేది కాదనేలేని సత్యం. సీబీఐ,ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఇప్పటి వరకూ ఉత్కళ తీరంలో అడుగుపెట్టలేదు.
ఒక ప్రముఖ మీడియా సంస్థ ద్వారా విశ్వసనీయ సర్వే ప్రకారం, పట్నాయక్ ప్రజాదరణ ఇటీవలి సంవత్సరాలలో 78 శాతం నుంచి 52 శాతానికి పడిపోయింది. ఆదరణ తగ్గడం అంటే రాష్ట్ర అసెంబ్లీలో మునుపటి కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే దీనర్థం భవిష్యత్ లో బీజేపీకి మరికొన్ని సీట్లు పొందినట్లు లెక్క. అధికార BJDకి చెందిన 45-50 అసెంబ్లీ స్థానాల మధ్య ఎక్కడైనా బీజేపీ గెలుపొందే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్న మాట.
ఇలా జరగకుండా ఉండాలంటే బీజేపీని మచ్చిక చేసుకోవాలని బీజేడీ భావించి ఉండవచ్చు. ప్రస్తుతం సెకండ్ ఇన్ చార్జ్ గా భావిస్తున్న పాండియన్ తమిళుడు. బీజేపీని ఈయని లక్ష్యంగా చేసుకోవడం సులువు. నాన్ లోకల్ అనే నినాదం ప్రచారం ప్రారంభిస్తే ఓటర్లు సహజంగానే బీజేపీకి మద్దతునిస్తారు. ఇలా జరగకుండా ఉండేందుకు ఇలా అంశాలవారీగా మద్ధతు ఉంది. ఇప్పటి వరకూ కమలదళం బీజేడీ నంబర్ టూను తీవ్రంగా విమర్శించలేదు.
బిజెడిలోని అగ్రశ్రేణి ఇద్దరు బిజెపి కేంద్ర నాయకత్వంతో ఆనందిస్తున్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, బిజెడి నంబర్ టూను విమర్శించడంలో దాని రాష్ట్ర నాయకులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అధికారిక ఎన్నికల ఒప్పందం బిజెపిని మచ్చిక చేసుకోవడంలో పట్నాయక్ పాండియన్‌లకు ఎంతో సహాయం చేసి, దాని నాయకులను పూర్తి స్థాయి దాడికి వెళ్ళకుండా చేస్తోంది.
2019 ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు 70 శాతానికి పైగా ఓట్లను సాధించాయి. ఇది చాలా బలీయమైన కలయిక, ఇది BJD తన స్వల్పకాలిక లాభం కోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అయితే తనకు దీర్ఘకాల నష్టం జరుగుతుందని భావించిన బీజేపీ పొత్తుకు వెనక్కి తగ్గింది.
లోక్‌సభలోనూ, అసెంబ్లీలోనూ ఈసారి - మోడీ ప్రజాదరణ పెరగడం, పట్నాయక్‌పై అధికార వ్యతిరేకత పెరగడం వంటి కారణాలతో ఈసారి పార్టీ ప్రదర్శన మెరుగవుతుందని రాష్ట్ర బిజెపి నాయకులు కేంద్ర నేతలను ఒప్పించగలిగారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు పట్నాయక్‌ను పదవి నుంచి దింపలేకపోయినప్పటికీ ఇప్పటికీ సౌకర్యవంతమైన పోల్ పొజిషన్‌లో ఉన్నామని అనుకుంటున్నారు. త్వరలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు కలలు కంటున్నారు. ప్రత్యర్థులను చిత్తు చేయడంలో మొనగాడిగా పేరొందిన నవీన్ పట్నాయక్.. ప్రస్తుతానికి తన ఎత్తులు చాలించి, పొత్తులు పక్కనపెట్టారు.
భవిష్యత్తులో కూడా, అవసరమైతే అతను పార్లమెంటులో మోదీకి సంఖ్యాపరంగా మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. అన్నింటికంటే, వృద్ధాప్య ముఖ్యమంత్రి మూడుసార్లు ఎన్నికైన ఒక శక్తివంతమైన ప్రధానమంత్రి ఆగ్రహాన్ని ఆహ్వానించలేరు.

Read More
Next Story