రొహింగ్యాలకు ఆశ్రయం కల్పించలేం: కేంద్రం
x

రొహింగ్యాలకు ఆశ్రయం కల్పించలేం: కేంద్రం

రోహింగ్యాలకు దేశంలో స్థిరపడే హక్కు లేదని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి చొరబడే వారిని 'శరణార్థులు'గా పరిగణించలేమని పేర్కొంది.


భారత్‌లోకి ప్రవేశించిన రోహింగ్యా శరణార్థులు దేశంలో ఉండే హక్కు లేదని కేంద్రం పేర్కొంది. చట్టవిరుద్ధంగా భారతదేశానికి తరలివెళ్లే వారిని 'శరణార్థులు'గా పరిగణించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించి, దేశంలో స్థిరపడేందుకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కేంద్రం తరఫున మోదీ ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. అందులో రోహింగ్యా ముస్లింలకు సంబంధించి ప్రభుత్వ చట్టపరమైన వైఖరిని అఫిడవిట్ ద్వారా తెలిపింది.
చట్టప్రకారం అర్హులు కారు..
రోహింగ్యా ముస్లింలు భారత పౌరులు కాదు. వారు శరణార్థులు కూడా కాదు, చొరబాటుదారులు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వారికి శరణార్థుల హోదాను కూడా మంజూరు చేయలేరు. అందువల్ల వారు భారత రాజ్యాంగం ప్రకారం చట్టపరమైన ఆశ్రయం పొందేందుకు కూడా అర్హులు కాదు. ఈ అఫిడవిట్‌లో, భారత రాజ్యాంగం ప్రకారం చట్టపరమైన ప్రక్రియలో కూడా వారికి చోటు కల్పించలేమని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
భద్రతా సమస్య..
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ( యూఎన్‌హెచ్ఆర్‌సీ ) శరణార్థి కార్డుతో రోహింగ్యా ముస్లింలు వస్తున్నారు. భారతదేశం ఇప్పటికే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిణామం అసోం, పశ్చిమ్ బంగ రాష్ట్రాల జనాభా పరిస్థితిని మార్చింది. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది. ఫలితంగా అంతర్గత భద్రత సమస్యలు వస్తున్నాయి. అందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదని పేర్కొంది.
Read More
Next Story