తెలంగాణలో అర్బన్ నక్సల్స్ లేరు: డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం
x
డీజీపీ బి శివధర్ రెడ్డి (ఫొటో : ఎక్స్ పోస్టు /డీజీపీ పోస్టు)

తెలంగాణలో అర్బన్ నక్సల్స్ లేరు: డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం

గణపతి లొంగుబాటు పై సమాచారం లేదు: డీజీపీ క్లారిటీ


తెలంగాణలో అర్బన్ నక్సల్స్ ఉనికి లేదని రాష్ట్ర పోలీసు డీజీపీ బి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరిఖనిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్రం ప్రస్తుతం మావోయిస్టు రహిత దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

మావోయిస్టు అగ్ర నాయకుడు, మోస్ట్ వాంటెడ్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయినట్లు వస్తున్న వార్తలపై తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు.గణపతి లొంగుబాటు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా "ఆయుధాలు విడనాడి జనజీవన స్రవంతిలో ఎప్పుడు కలుస్తారనే విషయాన్ని గణపతే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది’’ అని డీజీపీ వ్యాఖ్యానించారు.ఆదివారం గోదావరిఖనిలో సాయుధ రిజర్వ్ పోలీసుల క్వార్టర్లను ప్రారంభించిన అనంతరం, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.'అర్బన్ నక్సల్స్'సమస్యపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ ఉనికి ఏమాత్రం లేదని పోలీసు శాఖ అధిపతి స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

తెలంగాణ ఇప్పుడు మావోయిస్టు రహిత రాష్ట్రం

తెలంగాణ రాష్ట్రం ప్రస్థుతం మావోయిస్టు రహిత రాస్ట్రమని డీజీపీ చెప్పారు. సురక్షిత తెలంగాణ దిశగా ఇదొక కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.తీవ్రవాదాన్ని నిర్మూలించి, శాంతిని పునరుద్ధరించడానికి తాము చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో మావోయిస్టుల లొంగుబాట్లు ఒక నిర్ణయాత్మక మైలురాయి అని చెప్పారు. సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమర్థవంతంగా నిర్వీర్యమైందని డీజీపీ తెలిపారు. తెలంగాణ పోలీసు బలగాలు, ఎస్‌ఐబీ బృందాల అవిశ్రాంత కృషిని డీజీపీ ప్రశంసించారు.
మొత్తానికి, తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు సాధించిన విజయాలు రాష్ట్రాన్ని మావోయిస్టు ప్రభావం నుంచి దూరం చేశాయని డీజీపీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా తీవ్రవాదానికి ఎటువంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని, ప్రజల సహకారంతో సురక్షిత తెలంగాణ నిర్మాణం మరింత బలపడుతుందని తెలిపారు.


Read More
Next Story