వాలెంటైన్స్ డే వద్దు, పుల్వామా అమరవీరుల దివస్ ముద్దు
x
వాలెంటైన్స్ డేను నిషేధించాలని పోస్టరును విడుదల చేస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు

వాలెంటైన్స్ డే వద్దు, పుల్వామా అమరవీరుల దివస్ ముద్దు

వాలెంటైన్స్ డే కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలంగాణ భజరంగ్ దళ్ హెచ్చరిక


పాశ్చాత్య సంస్కృతి అయిన వాలెంటైన్స్ డే ను నిషేధించాలని తెలంగాణ భజరంగ్ దళ్ గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన యువతను చెడు మార్గంలో నడిపించేందుకు కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు వాలెంటైన్స్ డే పేరిట తీసుకువచ్చారని తెలంగాణ భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీకాంత్ ఆరోపించారు. గురువారం కోఠిలోని వీహెచ్ పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

వాలెంటైన్స్ డేను అడ్డుకుంటాం

వాలెంటైన్స్ డేను నిషేధించి, ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా అమరవీరుల దివస్ ను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రేమ పేరిట అమాయక యువత జీవితాలను నాశనం చేయవద్దని ఆయన కోరారు. ఉదయం పార్కుల్లో పుట్టిన ప్రేమ సాయంత్రానికి ముగిసేది కాదని, దీనిపై యువత ఆలోచించాలని శ్రీకాంత్ సూచించారు. పుల్వామాలో దేశంలో కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లదివస్ ను జరుపుకుందామని ఆయన కోరారు. మన వీర జవాన్లకు నివాళులు అర్పిద్దామని యువతకు సూచించారు. వాలెంటైన్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తే తాము అడ్డుకుంటామని శ్రీకాంత్ హెచ్చరించారు.

రొమాన్స్ స్కామ్‌ల పట్ల జాగ్రత్త : సీపీ సజ్జనార్ హెచ్చరిక

వాలెంటైన్స్ డే నాడు రొమాన్స్ స్కామ్‌ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. వాలెంటైన్స్ డే గులాబీల గురించి, ఎర్ర జెండాల గురించి కాదు... కానీ మీరు డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియాలో ప్రేమ కోసం చూస్తున్నప్పుడు, మరొకరు మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చూస్తుండవచ్చునని సీపీ తెలిపారు. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విదేశీ ఉద్యోగ కథనాలు, ఆకస్మిక అత్యవసర పరిస్థితులు మిమ్మల్ని డబ్బు అడగడానికి క్లాసిక్ వ్యూహాలు’’ అని సీపీ పేర్కొన్నారు.డబ్బు అభ్యర్థనలు: మీరు వ్యక్తిగతంగా కలవని వ్యక్తికి డబ్బు, క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్‌లు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ పంపవద్దని సీపీ సూచించారు.
Read More
Next Story