ఐసీసీ ర్యాకింగ్స్: మూడు ఫార్మాట్ లో నెంబర్ వన్ గా..
x

ఐసీసీ ర్యాకింగ్స్: మూడు ఫార్మాట్ లో నెంబర్ వన్ గా..

ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంక్ లో భారత్ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డేలు, టీ20 ల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా, తాజాగా టెస్టుల్లో


ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్ గా నిలిచింది. ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 తో గెలుచుకుంది. దీంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రకటిస్తున్న పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి చేరినట్లయింది.

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే వన్డేలు, టీ20 ల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ఏకపక్షంగా గెలవడంతో టెస్టుల్లోనూ నెంబర్ వన్ జట్టుగా నిలిచింది. అయితే ఈ ఫలితాలపై ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితం ప్రభావం చూపే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ రెండు జట్లలో ఎవరు గెలిచిన భారత నెంబర్ వన్ స్థానానికి ముప్పు ఉండదు.
122 రేటింగ్ పాయింట్లతో భారత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు ఆధిక్యంలో ఉండగా, ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
వన్డేల్లో భారత్‌కు 121 రేటింగ్ పాయింట్లు ఉండగా, 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.
టీ20ల్లో భారత్ 266 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ (256) రెండో స్థానంలో ఉంది.
రెండో స్థానం నుంచి
సెప్టెంబరు 2023 నుంచి జనవరి 2024 వరకు భారతదేశం ప్రపంచ నం.1 టెస్ట్ జట్టుగా ఉంది, దక్షిణాఫ్రికాతో సిరీస్ డ్రా అయిన తర్వాత టీమిండియా రెండవ స్థానానికి పడిపోయింది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ తొలి టెస్ట్ లో ఓటమి పాలైంది. కానీ తరువాత జరిగిన నాలుగు టెస్టుల్లో టీమిండియా అసాధారణంగా ఫుంజుకుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్‌, రాంచీ, ధర్మశాలలో వరుసగా విజయాలు సాధించింది. ఇవన్నీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేందుకు దోహదపడ్డాయి.


Read More
Next Story