ఒదిశా బిజెడికి  తెలుగు రాజకీయ జబ్బు
x

ఒదిశా బిజెడికి తెలుగు రాజకీయ జబ్బు

పవర్ పోతూనే పార్టీ మారకపోతే ఈ కాలం రాజకీయనాయకుడు ఎదుగలేడు...


పవర్ పోతూనే పార్టీ మారడం అనేది దేశమంతా ఉంది. కాకపోతే, తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ. మొన్నటికి మొన్న ఇద్దరు వైఎస్ ఆర్ కాంగ్రె స్ పార్టీ రాజ్య సభ సభ్యులు పార్టీ వదిలేశారు. ఇద్దరు టిడిపిలో చేరుతున్నారు. ఇంకా చాలా మంది మంతనాలు సాగిస్తున్నారు. వాళ్లలో కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి, ఇంకొందరు బిజెపిలోకి , మరికొందరు జనసేనలోకి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఉడాయిస్తారని వూహాగానాలు వినబడుతున్నాయి. ఇదే పరిస్ఘితి తెలంగాణలో కూడా ఉంది. ఇక తెలంగాణ సంగతి చెప్పాల్సిన పనిలేదు,. పార్టీ ఫిరాయించడంలో వాళ్లది ఉద్యమమే. గుంపులు గుంపులుగా వస్తారు , పోతారు. అయితే, విషయమేమిటంటే, ఇపుడిదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల పొరుగు రాష్ట్రమయిన ఒదిషా లో కూడా మొదలయింది. చాలా మంది బిజూ జనతా దళ్ ను వదిలేసి బిజెపిలోకి వెళ్తున్నారు. బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ నిరంకుశుడని, అక్కడ స్వేచ్ఛలేదని చెప్పి చాలా మంది పార్లమెంటు సభ్యులు బిజెపిలోకి వెళ్తున్నారు.

మొన్న శుక్రవారం నాడు బిజెడి రాజ్యసభ్యుడు సుజీత్ కుమార్ ఢిల్లీలో బిజెపి పెద్దల సమక్షంలో కాాషాయ ఖండువా కప్పుకున్నారు. అయితే, వెళ్లే ముందు పార్టీ అధినేతకు ఒకలేఖరాశారు. " నన్ను రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ విషయంలో నేను మీకు రుణ పడిఉంటాను. ఇంతవరకు నేను పార్టీకి ,రాష్ట్రానికి సేవ చేస్తూనే ఉన్నాను. ఉమ్మడి కలహండి జిల్లా నుంచి నేను ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తూనే ఉన్నాను. మీదయతో ఇక ముందుకూ ప్రస్తావిస్తూనే ఉంటాను. అయితే, ఈ మధ్య పార్టీ లో నన్ను చిన్న చూస్తున్నారు. ఇది నన్న బాధించింది. అందుకే బిజెడిలో ఉండలేకపోతున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, విశాల ప్రజా ప్రయోజనాలకోసం నేను పార్టీ వీడాలనే నిర్ణయం తీసుకున్నాను. మీ రాజీనామాను ఆమోదించండి," అని సుజీత్ కుమార్ లేఖ రాశారు.

అయితే, దీని ఆగ్రహించిన నవీన్ పట్నాయక్, సుజీత్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ద్రోహం అని ఆయన ట్వీట్ చేశారు.

ఇది ఇలా ఉంటే, మొదట బిజెడి నుంచి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యురాలు మమతా మహంత మరొక బాంబు పేల్చారు. చాలా ఎంపిలు తమ మార్గంలోనే పయనించే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు.

"పార్టీలో నియంతృత్వ ం నడుస్తూ ఉంది. నేతలకు , కార్యకర్తలకు గౌరవం లేదు. నేను ప్రాతినిధ్యం వహించే మయూర్భంజ్ జిల్లాలో ఎనభై శాతం మంది కార్యకర్తలు అసంత ృప్తితో ఉన్నారు. అందువల్ల మరికొందరు ఎంపిలు పార్టీ మారవచ్చు, సూచనలు కనిపిస్తున్నాయి, " అన్నారు. మమతా మహంతా 2020 లొనే బిజెడి నుంచి రాజ్యసభలో ఎన్నికయ్యారు.నెలలోనే ఫిరాయించి బిజెపిలో చేరారు,. తర్వాత బిజెపి ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది.

ఆంధ్రాలో నైనా, తెలంగాణలో నైనా, పక్కనున్న ఒదిశాలోనైనా రాజకీయాలంటే పవర్, పైసలే.

Read More
Next Story