రింకూసింగ్ పై.. పది బంతుల‘ఇంపాక్ట్’ బాగానే పడిందా..!
టీమిండియాలో రింకూ సింగ్ చోటు దక్కించుకోక పోవడంపై ఏ అంశం కారణమై ఉంటుంది. 2019 లో వరల్డ్ కప్ కు అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడం ఎంత తప్పో.. రింకూ ను కూడా..
జూన్ నుంచి అమెరికా- వెస్టీండీస్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు టీమిండియాను ఎంపిక చేశారు. ఇందులో ఎక్కువగా ఊహించిన పేర్లే ఉండగా.. రింకూ సింగ్ పేరు కనిపించపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఈ సారి జట్టు ఎంపిక జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రింకూ సింగ్ హర్డ్ హిట్టర్ గా పేరున్నప్పటికీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కేవలం ట్రావెల్ రిజర్వ్ ఆటగాడిగా మాత్రమే రింకూ సింగ్ జట్టుతో వెళ్లనున్నాడు. రింకూ కు బదులు లెప్ట్ హ్యాండర్, సీమర్ అయినా శివమ్ దూబే జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈ లీగ్ లో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ సబ్ విధానం రింకూ సింగ్ పై ఎక్కువ ప్రభావం చూపినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కేకేఆర్ తనని ఈ విధానం లో ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ సేపు మైదానంలో ఉండే అవకాశాన్ని రింకూ కొల్పోయాడు. అదే సమయంలో శివమ్ దూబే ను సీఎస్కే అద్భుతంగా బ్యాట్స్ మెన్ గా ఉపయోగించుకుంది.
దూబే బౌలింగ్ లో అంత పేస్ లేదు. బౌలింగ్ కు దింపినట్లయితే అతను లక్ష్యంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ విధానంలో కేవలం బ్యాట్స్ మెన్ గా టాప్ 5 లో బరిలోకి దిగే అవకాశం లభించింది. దీంతో దూబే తన కొన్ని మ్యాచ్ ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఇలా మొదటి పది మ్యాచ్ లు పూర్తయ్యే సరికి దూబే పేరు టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపించడం ప్రారంభమయ్యాయి. మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన సెలక్షన్ కమిషన్, రింకూను ట్రావెల్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేసింది. దూబేకు ప్రధాన జట్టులో చోటు దక్కింది.
ఫినిషర్‌గా మాత్రమే చూసిన.. కేకేఆర్
"నిస్సందేహంగా, ఇంపాక్ట్ ప్లేయర్ నియమానికి రింకు మూల్యం చెల్లించాడు. అతడు చాలా దురదృష్ట వంతుడు, హార్ధిక్ పేలవమైన ఫామ్ లో ఉండవచ్చు కానీ, ఉత్తమ సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్. జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడికి ఉంది. కచ్చితంగా అతని ఎంపిక అనివార్యం ”అని బిసిసిఐ అధికారి వ్యాఖ్యానించారు.
కేకేఆర్ రింకూను ఫినిషర్ గా భావించింది. అతనికి టాప్ ఫైవ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. సెలక్షన్ కు ముందు రింకూ సింగ్ కేకేఆర్ తరఫున ఎనిమిది మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఇందులో 82 బంతులను మాత్రమే ఎదుర్కొనే అవకాశం రింకూ సింగ్ లభించింది.
అంటే ప్రతి మ్యాచ్ కు 10 బంతులు అన్నట్లు. శ్రేయస్ అయ్యార్, వెంకటేష్ అయ్యార్, అంగ్క్రిష్ రఘువంశీ లు టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తూ చాలా మ్యాచ్ లు ముగిస్తున్నారు. ఇక రింకూకు మ్యాచ్ లు ఆడే అవకాశం లభించలేదు. రింకును ప్రోత్సహించనందుకు KKRని నిందించలేము కానీ నిజం చెప్పాలంటే, ఇద్దరు అయ్యర్‌లు జాతీయ ఎంపిక కోసం ఎప్పుడూ పోటీలో లేరు. వారి పేర్లు చర్చకు కూడా రాలేదు. దీనికి విరుద్ధంగా, చెన్నై సూపర్ కింగ్స్, వారి చురుకైన వ్యూహకర్త మహేంద్ర సింగ్ ధోనీ 2021 సీజన్‌లో వచ్చిన డూబే ను ఉత్తమంగా ఉపయోగిస్తున్నారు. ఇదే రింకూ కు షాపం అయింది.
CSK తరపున దూబే ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో 203 బంతులు ఎదుర్కొన్నాడు. అంటే ప్రతి మ్యాచ్ కు 23 బంతులు -- రింకు కంటే 13 బంతులు ఎక్కువ. ఈ 13 బంతుల గ్యాప్ లో దూబే 24 ఫోర్లు, 26 సిక్సర్లు సాధించేలా చేసింది. రింకూ తన 82 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌లతో రాణించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకపోతే, ధోనీ, ప్రస్తుత CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూబేను సమర్థవంతంగా ఉపయోగించగలారా? అనేది స్పష్టంగా తెలియదు.
ఆకట్టుకునే స్ట్రైక్ రేట్
జనవరి 2024 వరకు భారత్ తరఫున 15 మ్యాచ్ లు ఆడిన రింకూ సింగ్ 176 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి, అయినప్పటికీ ప్రధాన జట్టులో స్థానం లభించలేదు. 2019 వరల్డ్ కప్ లో అంబటి రాయుడిని తప్పించడం ఎంత తప్పు నిర్ణయమే.. ఈ టీ20 వరల్డ్ కప్ కు నుంచి రింకూ తప్పించడం అలాంటిదే. అయితే రింకూ ట్రావెలింగ్ రిజర్వ్‌లలో భాగమైనందున, మొదటి జట్టు సభ్యులలో ఎవరైనా గాయపడినట్లయితే అతను 15లోకి వచ్చే అవకాశం ఉంది.
Next Story