ఇక అడవుల్లో మిగిలింది 17 మంది మాత్రమే...
x

ఇక అడవుల్లో మిగిలింది 17 మంది మాత్రమే...

కేవలం తెలంగాణ టాప్ నేతలతోనే నడుస్తున్న మావోయిస్టుపార్టీ



సిపిఐ(మావోయిస్టు) సంస్థకు తెలంగాణ నుంచి ఎదిగిన నక్సల్ నాయకులే గుండెకాయ. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ విస్తరించేందుకు తెలంగాణ నేతల వ్యూహాలు, ధైర్యసాహస కార్యక్రమాలే కారణం. బీహార్, చత్తీష్ గడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో మావోయిస్టులు ఉన్నాతెలుగు మావోయిస్టులే సైద్ధాంతికంగా,సైనికంగా రాటుదేలిని నాయకులు.అందుకే ఉత్తరాది మావోయిస్టులు, సిపిఐ ఎం ఎల్ పీపుల్స వార్ తో కలసి 2004 సెప్టెంబర్ లో మావోయిస్టు పార్టీగా అవతరించేందుకు ముందుకు వచ్చారు. అప్పటినుంచి ఈ పార్టీ బీహార్ నుంచి తెలంగాణ ాదాకా అటవినంతా తమ సామ్రాజ్యం చేసుకున్నారు. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. అడవుల్లోకి సాయుధ దళాలు ప్రవేశించాయి. అపరేషన్ కగార్ అంటూ కేంద్రం అడవులనుంచి ఈ పార్టీ తరిమేసేందుకు ఒక విధంగా యుద్ధమే ప్రకటించింది. పోలీసులు అడవుల్లోకే కాదు, మావోయిస్టు నెట్ వర్క్ లోకి కూడా చొరబడడారు. గత 40 నలభైయేళ్లలో ప్రపంచం ముందుకురాని నేతలను కూడా పట్టుకుంటున్నారు. మావోయిస్టులను ఎన్ కౌంటర్లలో చంపేస్తున్నారు. తమ దగ్గిర ఉన్న ఆయుధాలలు సాయుధదళాల ఆయుధాలకు సాటిరావని, కేవలం సిద్ధాంతంతో ఆపరేషన్ కగార్ ను ప్రభుత్వ సాయుధదళాలను ఎదుర్కోలేమని నిజం తెలుసుకున్నవాళ్లు లొంగిపోతున్నారు. దీనితో మావోయిస్టు అగ్రనాయకత్వం బలహీనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు తెలంగాణ మావోయిస్టు నేతల గురించిన అసక్తికరమయిన సమాచారం విడుదల చేశారు. వివరాలు:

ప్రస్తుతం తెలంగాణకు చెందిన 17 మంది మాత్రమే మిగిలి ఉన్నారు.

పోలీసుల చేతిలో ఆ 17 మంది జాబితా ఉంది. దాని ప్రకారం వాళ్ల కదలికల మీద దృష్టి పెట్టారు.

వీరిలో 4గురు సెంట్రల్ కమిటీలో 5 గురు స్టేట్ కమిటీలో 6 గురు డివిజన్ కమిటీలో
ఒకరు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు.

మొత్తం 17 మంది లొంగిపోతే మావోయిస్టు నాయకులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతుందని పోలీసులుఅంటున్నారు.

లొంగిపోవాలని తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి 17 మందిని కోరారు.

ఈ ఏడాది మార్చినాటికి ఆపరేషన్ కగార్ పూర్తయ్యే లోపే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించి ప్రశంసలు పొందాలని తెలంగాణ పోలీస్ లు పనిచేస్తున్నారు.


17 మందిలో ప్రస్తుతం కేంద్ర కమిటీలో కొందరు, రాష్ట్రాల కమిటీ లో మరికొందరు ఉన్నారు

17 మంది తెలంగాణ మావోయిస్ట్ ల పై 2.కోట్ల 25 లక్షలు రివార్డ్.

17 మంది పేర్లను పోలీసులు విడుదల చేశారుు.

సెంట్రల్ కమిటీ సభ్యులు

* ముప్పాల లక్ష్మణ్ రావ్ @గణపతి
* తిప్పిరి తిరుపతి @దేవ్ జి
* మల్లారాజి రెడ్డి @సంగ్రామ్
* పసునూరి నరహరి@సంతోష్
స్టేట్ కమిటీ సభ్యులు
* ముప్పిడి సాంబయ్య@సుదర్శన్
* వార్త శేఖర్ @మంగుత్
* జోడే రత్నా భాయ్
* నక్కా సుశీల
* లోకేటి చంద్ర శేఖర్
* దామోదర్

డివిజన్ కమిటీ సభ్యులు
* రాజేశ్వరి
* రంగబోయిన భాగ్య
* బాడిషా ఉంగా
* సంగీత
* భవాణి
* మైసయ్య.
* భగత్ సింగ్


Read More
Next Story