
ఆపరేషన్ సింధూర్
ఆపరేషన్ సింధూర్: ఎల్ఓసీ వద్ద పరిస్థితి ఎలా ఉంది?
సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పులు, పదుల సంఖ్యలో ప్రజలు మృతి
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ జరిపిన క్షిపణి దాడులతో పాకిస్తాన్ బిత్తరపోయింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
దీనికి ప్రతిగా పాక్ బోర్డర యాక్షన్ టీమ్ లు భారీ ఫిరంగి దాడులకు పాల్పడటంతో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. జమ్మూకు చెందిన సీనియర్ జర్నలిస్టు తరుణ్ ఉపాధ్యాయ్ ది ఫెడరల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పునీత్ నికోలస్ యాదవ్ తో మాట్లాడారు.
ప్రశ్న: పునీత్ నికోలస్ యాదవ్: పూంఛ్, రాజౌరీ, మెందార్ వంటి ప్రాంతాలలో భారీ కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఫిరంగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
తరుణ్ ఉపాధ్యాయ్: పూంచ్ లో పరిస్థితి దారుణంగా ఉంది. నేను కొన్ని నిమిషాల క్రితం మాట్లాడిన సీనియర్ అధికారుల ప్రకారం.. పూంచ్ పట్టణంలోనే దాదాపు 10 మంది మరణించారు. స్థానికులు వారి జీవిత కాలంలో ఎప్పుడూ ఇంత భారీ షెల్లింగ్ ను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.
ఏప్రిల్ 22 నుంచి ఎల్ఓసీ వెంబడి చిన్న ఆయుధాలతో కాల్పులు కొనసాగుతున్నప్పటికీ ఈ స్థాయిలో కాల్పులు ఆశ్చర్యకరమైనవి. మెందార్ లో ఒక పౌరుడి మరణం అధికారికంగా ధృవీకరించబడింది. అయితే కొన్ని వర్గాలు ముగ్గురు మరణించారని పేర్కొంటున్నారు. ఇక్కడ వాతావరణం గందరగోళంగా, భయంతో ఉంది.
ప్రస్తుతం కూడా కాల్పులు కొనసాగుతున్నాయా? ఆగిపోయాయా?
నాకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం పూంచ్ పట్టణంలో కాల్పులు దాదాపు పది నిమిషాల క్రితమే ఆగిపోయాయి. కానీ ఎల్ఓసీ వెంబడి ఇంకా కొనసాగుతున్నాయి.
స్థానిక అధికారులు మరణాలను అధికారికంగా మరణాలను ధృవీకరిస్తున్నారా? కేంద్రం లేదా రక్షణ మంత్రిత్వశాఖ నుంచి ఇంకా ధృవీకరణ రాలేదా?
అనధికారికంగా పూంచ్ లో తొమ్మిది లేదా పదిమంది పౌరులు మరణించారని, పూంచ్ లోని సీనియర్ అధికారులు నాకు చెప్పారు. ఈ ప్రాంతంలోని పెద్దలు కూడా తాము ఇంతకుముందు ఇలాంటి కాల్పులు చూడలేదని చెబుతున్నారు.
ఈ రోజు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఉన్నాయి, యుద్దం ప్రారంభం అయినప్పుడూ స్థానిక అధికారులు, పౌరులు సిద్దంగా ఉన్నారా?
ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మాక్ డ్రిల్స్ రద్దు చేశారు. దురదృష్టవశాత్తూ నియంత్రణ రేఖ వెంబడి నివసించే ప్రజలు అప్పుడప్పుడూ కాల్పులు, ప్రాణ నష్టాలకు అలవాటు పడ్డారు. అధికారులు సాధారణంగా సిద్దంగా ఉంటారు.
అయితే ఈ సారి తీవ్రత ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. సాధారణంగా కాల్పులు వారాత తరబడి కొనసాగినప్పుడూ ఈ స్థాయిలో మరణాలు సంభవిస్తాయి. కానీ ఒక్క రోజులోనే ఇంతమంది సాధారణ పౌరులు మరణించారు. ఈ షెల్లింగ్ కేవలం నియంత్రణ రేఖ వద్దే కాకుండా ఫూంచ్, మెందార్ వంటి పట్టణ కేంద్రాలకు కూడా చేరుకోవడం ఆందోళనకరమైన విషయం.
ఈ ప్రాంతాల నుంచి ప్రజలు పారిపోతున్నారా? స్థానభ్రంశం చెందే అవకాశం ఉన్న పరిస్థితి ఏమిటీ?
మెందార్ లోని దట్టి ప్రాంతం నుంచి దాదాపు 2 వేల మంది ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. నేను స్థానిక డ్రైవర్లతో మాట్లాడాను. వారు కూడా జమ్మూ వైపు ప్రజలు వస్తున్నారని నాకు చెప్పారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.
జమ్ములోనే సంసిద్దత ఏమిటీ? దళాల సమీకరణ లేదా పౌర రక్షణ చర్యలు ఆక్టివ్ గా ఉండటం మీరు చూశారా?
కచ్చితంగా చెప్పవచ్చు. గత మూడు నాలుగు రోజులుగా దళాల సమీకరణ జరుగుతోంది. రాజౌరి, ఫూంచ్ మాత్రమే కాకుండా జమ్మూ జిల్లాలోని అర్నియా, అరస్పురా, బిష్నా ప్రాంతాలలో కూడా భారీ ఫిరంగి దళాలను, ట్యాంకులను సరిహద్దు ప్రాంతాలకు తరలించారు.
అధికారులు పాత బంకర్లను శుభ్రం చేస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ప్రజలు లోతట్టు ప్రాంతాలకు తరలిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అన్ని డిప్యూటీ కమిషనర్లను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదనపు నిధులు విడుదల చేశారు. ఉద్రిక్తత మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నందున జమ్మూ అంతటా విద్యాసంస్థలు మూసివేశారు.
Next Story