
ఆపరేషన్ సింధూర్
ఆపరేషన్ సింధూర్: పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం..
ప్రతిదాడులు ఉంటాయన్న పాకిస్తాన్, తొమ్మిది ప్రాంతాలపై ఏకకాలంలో దాడులు
పహల్గామ్ లో ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 26 మంది అమాయక టూరిస్టులను మతం పేరుతో ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై కచ్చితంగా సమాధానం ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి 1.44 నిమిషాలకు భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది.
ఈ దాడులపై అధికారిక సమాచారం పరిమితంగా ఉన్న నేపథ్యంలో ‘ ది ఫెడరల్’ జర్నలిస్ట్ నిషా పీ శేఖర్, సీనియర్ జర్నలిస్ట్ పునీత్ నికోలస్ యాదవ్ తో మాట్లాడి మను తెలిసినవి, పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో.. తదుపరి ఏం జరగబోతుందో ప్రజలు వివరించే ప్రయత్నం చేశారు.
పునీత్.. మాతో చేరినందుకు ధన్యవాదాలు.. పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడుల గురించి మీరు ఏమైనా చెప్పగలరా?
భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని కనీసం తొమ్మిది ప్రాంతాలపై క్షిపణి దాడులు నిర్వహించాయని, భారత రక్షణ శాఖ, ప్రెస్ ఇన్మర్మేషన్ బ్యూరో(పీఐబీ) ధృవీకరించాయి.
ఈ దాడులకు ‘ఆపరేషన్ సింధూర్’ అనే కోడ్ నేమ్ పెట్టారు. ప్రభుత్వం ఇంకా మరణాలు గురించి స్పష్టమైన సమాచారం విడుదల చేయలేదు. ఇవి పహల్గామ్ దాడికి ప్రతీకారం అని అర్థమవుతోంది. ఈ రోజు రక్షణ శాఖ దీనిపై పూర్తి సమాచారం ఇవ్వబోతోంది.
ఈ దాడులతో పాకిస్తాన్ ఎలా స్పందించబోతోంది?
పాకిస్తాన్ ఈ దాడులపై స్పందించింది. ‘‘తాను ఎంచుకున్న సమయంలో, ప్రదేశంలో దాడులు చేస్తుంది’’ అని పేర్కొంది. పాకిస్తాన్ కు సంబంధించిన అనేక మీడియా సంస్థలు, ఎక్స్ ఖాతాలు భారత ప్రభుత్వం నిలిపివేసింది. కాబట్టి ఆ సమాచారం మన దేశంలో లభించడం లేదు.
అయితే అంతర్జాతీయ మీడియా వీటిపై కొన్ని వార్తలు ప్రసారం చేశాయి. ముఖ్యంగా రాయిటర్స్, ది గార్డియన్ వంటివి పాకిస్తాన్ పై దాడి జరిగినట్లు, పాక్ సైన్యం ధృవీకరించినట్లు తెలిపాయి.
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్ పూర్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని ముజఫరాబాద్, కోట్లీ లో దాడులు జరిగాయి. మొత్తం తొమ్మిది నుంచి పన్నెండు ప్రాంతాలలో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ కు చెందిన రెండు టీవీ ఛానెల్ లు రెండు భారతీయ పైటర్ జెట్లపై కాల్పులు జరిపినట్లు తెలిపాయి. కానీ వీటిని భారత్ ధృవీకరించలేదు.
దాడి చేసిన సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి? ఎందుకు?
భారత్ తొమ్మిది ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు తెలిపింది. పాకిస్తాన్ అధికారికంగా స్పందించి మూడు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు చెప్పింది. లష్కర్ ఏ తోయిబా ప్రధాన కేంద్రం అయిన బహవల్పూర్ తో పాటు, ముజఫరాబాద్, కోట్లీలో దాడులు చేశారని పాక్ చెబుతోంది. వీటిపై రెండు ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీటిని మనం గమనించాల్సిన అవసరం ఉంది.
ఎంతమంది చనిపోయారు? వివరాలు ఏమైనా ఉన్నాయా?
భారత ప్రభుత్వం ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే విషయంలో వివరాలను వెల్లడించలేదు. పాకిస్తాన్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ మాత్రం కొన్ని వివరాలు వెల్లడించింది.
ఒక పిల్లవాడితో పాటు సహ ముగ్గురు పౌరులు మరణించారని, 12 మంది గాయపడ్డారని తెలిపింది. నేను చెప్పేదేమిటంటే ఇవి కేవలం పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపిన గణాంకాలు మాత్రమే. వాటిని మనం అసలు ధృవీకరించలేము.
మీరు ఈ వార్తలను ఎలా ధృవీకరిస్తున్నారు..?
నేను ఈ వార్తలను కేవలం రాయిటర్స్, గార్డియన్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి వస్తున్న సమాచారం ప్రకారమే చెబుతున్నాము. వారు కూడా పాకిస్తాన్ లో ఉన్న ఆన్ ది గ్రౌండ్ రిపోర్టర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నామని వివరిస్తున్నారు.
పాకిస్తాన్ ప్రభుత్వ హ్యాండిల్స్ లేదా టీవీ ఛానెల్లకు ప్రత్యక్షంగా ఇక్కడ ప్రవేశం లేదు. ఈ వివరాలు కాసేపు అయ్యాక కొంచెం మారవచ్చు. కానీ పూర్తి వివరాలు మాత్రం వెల్లడవుతాయనే నమ్మకం ఉంది.
ప్రస్తుత పరిస్థితిని మనం ఎలా తీసుకోవాలి? పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడులు ఉంటాయి?
ఈ రోజు ఉదయం పదిగంటలకు భారత రక్షణశాఖ భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక బ్రీఫింగ్ రాబోతోంది. అక్కడ జరిగిన లక్ష్యాలు, ప్రాణనష్టం, ఆపరేషన్ లక్ష్యాలు వివరాలు మనకు లభించబోతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ స్పందన గురించి మనకు స్పష్టమైన ప్రకటన వచ్చింది. సైనిక పరిస్థితి చాలా ఉద్రిక్తంగా, సున్నితంగా ఉంది.
Next Story