సీఈసీ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల నిరసన
x

సీఈసీ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల నిరసన

సీఈసీ విపక్షాలను ఎందుకు కలవడం లేదని ఆందోళన, నిర్వచన సదన్ లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నం


Click the Play button to hear this message in audio format

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండి’కూటమి ఢిల్లీలో చేపట్టిన నిరసనలో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మరికొంతమంది ఎంపీలు కలిసి రోడ్డు మార్గంలో ఎన్నికల సంఘంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు.

వీరి పాదయాత్రను నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలోని పార్లమెంట్ వీధిలోని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో రెండువందల మీటర్ల దూరంలొనే వారు ఆగిపోయి, అక్కడే కూర్చుని నిరసన తెలిపారు. కొద్దిసేపటికే రాహుల్ గాంధీ, టీఎంసీ (మమతా బెనర్జీ వర్గం) ఎంపీ అభిషేక్ బెనర్జీ బారీకేడ్లను ఎక్కి ఎన్నికల కార్యాలయం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారు. ప్రియాంక గాంధీని సైతం తరువాత వారితో కలుసుకున్నారు.

రాహుల్, ప్రియాంక, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రెయిన్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని తరువాత వదిలేశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం చుట్టు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలను ఉద్రిక్తంగా మారకుండా బారికేడ్లతో పాటు వజ్రా వాహానాన్ని, డ్రోన్ లను మోహరించారు.
ప్రతిపక్ష ఎంపీలు కూడా ఆర్ఎస్ఎస్ యూనిఫాంలో కటౌట్లు ప్రదర్శిస్తూ ‘‘ఓటు దొంగ, పీఠం వదిలేయ్’’... ‘‘ప్రజాస్వామ్యం అమ్మకానికి కాదు’’ అని నినాదాలు చేశారు. ‘‘ జ్ఞానేశ్ కుమార్ సమయం అయిపోయింది.. రాజీనామా చేయాల్సిందే’’ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఇండి కూటమి ఎంపీలు మొదట పార్లమెంట్ మకర ద్వారం దగ్గర వద్ద సమావేశమై అక్కడి నుంచి ఈసీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్రగా బయల్దేరారు. పాదయాత్రకు ముందు వారు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఫారం 6 పై కూడా వారు ప్రస్తావిస్తూ సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ ప్రజల నమ్మకాన్ని జ్ఞానేశ్ కుమార్ దెబ్బతీశారని కాంగ్రెస్ ఎంపీ మసూద్ ఆరోపించారు. సర్ ప్రక్రియపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుస్తామని ఇండి బ్లాక్ ఎంపీలు ఇంతకుముందే ప్రకటించారు.
అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండించింది. ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. సర్ కు సంబంధించిన ప్రతి నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నామని వెల్లడించింది.


Read More
Next Story