సీఐడీ విచారణపై కౌశిక్ రెడ్డి రియాక్షన్ ఇదే !
x

సీఐడీ విచారణపై కౌశిక్ రెడ్డి రియాక్షన్ ఇదే !

మత మార్పిడులపై వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ కౌశిక్ రెడ్డి ఛాలెంజ్.


హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సీఐడీ అధికారులు శనివారం విచారించారు. విచారణ అనంతరం విచారణపై స్పందించిన కౌశిక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా వేధించడానికే ఈ విచారణలు చేస్తున్నారని, ఇందులో అధికారులు భాగస్వాములు అవుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే తాను మతమార్పిడులపై వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. కేవలం తాను చేస్తున్న పోరాటాలను నీరుగార్చడానికే తప్పుడు కేసులు, విచారణలు చేస్తున్నారని ఆరోపించారు.

‘‘నేను అనని మాటలు కూడా అన్నట్లు చెప్తున్నారు. పొంగులేటి మైనింగ్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే నాపై ఎథిక్స్ కమిటీ వేశారు. ప్రజల పక్షాన పోరాడటానికి నేను సిద్ధం. హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. కరీంనగర్ చెత్తను హుజూరాబాద్‌లో వేస్తా అంటూ చూస్తూ ఊరుకోం. ఈ డంపింగ్ యార్డ్ కరోనా కంటే ప్రమాదం’’ అని అన్నారు. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటాన్ని అణచివేయడానికే విచారణ పేరుతో అడ్డుకుంటున్నారని అన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగానే ఏప్రిల్ 7న హుజూరాబాద్‌లో దీక్షకు కూర్చోనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే కౌశిక్ రెడ్డి వివాదాలకు కేరాఫ్‌గా మారారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనే ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. పోలీసు విధులకు భంగం కలిగించడం, రొచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులకు సంబంధించి సీఐడీ అధికారులు ఆయనను శనివారం విచారించారు.

Read More
Next Story