మా అన్న గెలువకూడదనే త్రిసూర్ నుంచి పోటీ చేయిస్తున్నారు: పద్మజ
x

మా అన్న గెలువకూడదనే త్రిసూర్ నుంచి పోటీ చేయిస్తున్నారు: పద్మజ

కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబంపై కక్ష గట్టిందని పద్మజ వేణుగోపాల్ ఆరోపించారు. దివంగత కేరళ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్ కుమార్తె పద్మజ ఇటీవల బీజేపీలో చేరారు.


కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబంపై కక్ష గట్టిందని పద్మజ వేణుగోపాల్ ఆరోపించారు. దివంగత కేరళ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్ కుమార్తె అయిన పద్మజ ఇటీవల కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. గెలుపు అవకాశాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా తన సోదరుడు, లోక్‌సభ ఎంపీ కె. మురళీధరన్‌ ను వటకర సీటు నుంచి కాకుండా త్రిసూర్‌ నుంచి పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి గెలుస్తారని చెప్పారు.

‘‘త్రిసూర్‌లోని కొందరు నేతలకు కరుణాకరన్‌ పిల్లలు అంటే ఇష్టం లేదు. నా సోదరుడు వటకర (ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న) స్థానం నుంచి వచ్చే ఎన్నికలలో సులభంగా గెలుస్తాడు. కాని త్రిస్సూర్ నుంచి ఆయనను పార్టీ ఎందుకు పోటీకి దింపిందో నాకు అర్థం కావడం లేదు‘‘ అని పద్మజ వేణుగోపాల్ అన్నారు.

మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో త్రిస్సూర్‌లో తాను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తన ఓటమికి సహకరించిన నాయకులు ఇప్పుడు తన సోదరుడు మురళీధరన్ పక్కన నిలబడి ఉన్నారని ఆరోపించారు.

త్రిసూర్‌లోని కొందరు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పక్కన నిలబడేందుకు తన నుంచి కొందరు డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. అయినా కూడా తనను ప్రియాంక గాంధీతో కలిసి ప్రయాణించడానికి అనుమతించలేదని చెప్పారు. తర్వాత ఈ కార్యక్రమానికి కేపీసీసీ నిధులు మంజూరు చేసిందని తెలిసిందని, ఈ విషయమై సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు.

తాను బీజేపీలో చేరిన తర్వాత తనపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ నేతలపై కూడా ఆమె దాడి చేశారు పద్మజ. “వారంతా టీవీ చర్చల ద్వారా నాయకులు అయ్యారు” అని పేర్కొన్నారు. పార్టీ కోరితే సురేష్ గోపీకి ఓట్లు వేయిస్తానని, ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని చెప్పారు. మురళీధరన్‌ను కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దించగా, సీపీఐ తరుపున త్రిసూర్‌ నుంచి సీనియర్‌ నేత వీఎస్‌ సునీల్‌ కుమార్‌ను బరిలోకి దిగారు.

Read More
Next Story