తెలంగాణ భూపతిపూర్ వద్ద కనిపించిన పాతరాతియుగం పనిముట్లు
x

తెలంగాణ భూపతిపూర్ వద్ద కనిపించిన పాతరాతియుగం పనిముట్లు

కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధించిన పురావస్తుసంపద


కొత్త తెలంగాణచరిత్రబృందం పరిశోధకులు కొండవీటి గోపీవరప్రసాదరావు, మహమ్మద్ నసీరుద్దీన్, అహోబిలం కరుణాకర్ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపూర్ గ్రామంలో 12 పాతరాతియుగం రాతిపనిముట్లను గుర్తించారు. ఇవి 6అంగుళాల నుంచి 3అంగుళాల పొడవు కలిగివున్నాయి.

ఈ రాతిపనిముట్లలో క్లీవర్లు, క్లీవర్ చేతిగొడ్డలి, స్క్రాపర్లు, చాపర్లు, ఫ్లేక్స్, చేతిగొడ్డండ్లున్నాయి. వీటి తయారీశైలిని పరిశీలించినపుడు ఇవి లక్ష నుంచి 40వేల సంవత్సరాలకు పూర్వానివి అని తెలిసింది. వీటిలో ద్వికుంభాకార చేతిగొడ్డలి, ఏకముఖ స్క్రాపర్లు, ద్విముఖ క్లీవర్లున్నాయి.




భూపతిపూర్ గ్రామానికి పడమర దిక్కున, ఏజెన్సీ అడవిప్రాంతంలో, దేవాదుల పైప్ లైన్ దగ్గరలో గోదావరిపాయపారే వాగులో ఈ పాతరాతియుగం రాతిపనిముట్లన్నీ లభించాయి. ఇక్కడ ఒక పెద్ద రాతిపనిముట్ల కార్ఖానే ఉంది. పాతరాతియుగం పనిముట్లే కాదు, వందలాది మధ్యరాతియుగం సూక్ష్మరాతిపనిముట్లు(మైక్రోలిథ్స్) కూడా దొరుకుతున్నాయి. ఇటువంటి పురావస్తు సంపదగల ప్రదేశాలను సంరక్షిస్తే, అవి మానవ పురాసంస్కృతిని మనకు అందిస్తాయి.


Read More
Next Story