సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన ‘పతంజలి’
యోగా గురువు రాందేవ్ బాబా కు చెందిన పతంజలి సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పింది. వినియోగదారులను మోసం చేసే వాణిజ్య ప్రకటనలపై బేషరతుగా క్షమాపణ చెప్పింది.
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆచార్య బాలకృష్ణ బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇతర కంపెనీల ఉత్పత్తుల నాణ్యతను ప్రశ్నిస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతం అంటూ తప్పుడు ప్రకటనలు ఇవ్వడం పై బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
న్యాయమూర్తులు హిమా కోహ్లి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం తమ ముందు ఏప్రిల్ 2 లోపు వ్యక్తిగతంగా హజరుకావాలని ఆదేశించింది. దీనితో బాలకృష్ణ ధర్మాసనం ముందు ఆదేశించారు.
కోర్టుకు సమర్పించిన సంక్షిప్త అఫిడవిట్‌లో బాలకృష్ణ క్షమాపణ చెప్పారు. చట్టబద్ద పాలనపై తనకు అత్యంత గౌరవం ఉందని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని హమీ ఇచ్చారు. ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ప్రజల జీవన శైలిని సులభం చేయడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనే కంపెనీ ఉద్దేశ్యమని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
పతంజలి యాడ్స్ 1954 చట్టం ఉల్లంఘన
మధుమేహం, ఆస్తమా, రక్తపోటు సహ ఇతర జీవనశైలి వ్యాధులను నయం చేయడం గురించి పతంజలి ప్రకటనలు రూపొందించింది. అయితే ఇవన్నీ డ్రగ్స్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954 ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిసింది. నవంబర్ 21, 2023 నుంచి ప్రకటనలు జారీ చేయకుండా కంపెనీ నుంచి సుప్రీంకోర్టు ఒక అండర్ టేకింగ్ కూడా పొందింది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది.
పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక పార్టీగా పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ప్రతిస్పందనను దాఖలు చేయాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ చర్యలు తీసుకోవాలని కేంద్రం తన ప్రతిస్పందనగా పేర్కొంది.
అఫిడవిట్ 1954 చట్టం 'ప్రాచీనమైనది'
బాలకృష్ణ అఫిడవిట్, బేషరతుగా క్షమాపణలు చెబుతూ, 1954 చట్టాన్ని "ప్రాచీనమైనది" అని కూడా పేర్కొంది. " ఇప్పుడు ఆయుర్వేదంలో నిర్వహించిన క్లినికల్ పరిశోధనతో సాక్ష్యం-ఆధారిత శాస్త్రీయ డేటాను కలిగి ఉన్నారు, " అని వివరించారు. అయితే అఫిడవిట్‌లో కంపెనీ వద్ద ఉన్న ఆధారాలు పరిశోధనల స్వభావాన్ని వివరించలేదు.
Next Story