’అవినీతి నేతలను ప్రజలు ప్రశ్నించాలి‘
నేడు మన సమాజంలో భావ వ్యక్తికరణకు స్వేచ్ఛ లేదని ఏపీ ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షులు ఎల్.వి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.
- ఎల్ వి సుబ్రమణ్యం
ప్రజాస్వామ్యం వికసించాలంటే అవినీతిపరులైన రాజకీయ నేతలను, ప్రజా ప్రతినిధులను ప్రజలు ప్రశ్నించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షులు ఎల్.వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈనెల 1వ తేదీన మచిలీపట్నంలోని శ్రీ పద్మావతి మహిళా హిందూ కళాశాల సెమినార్ హాల్లో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై జరిగిన కళాజాతకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల దొంగలు ఉన్నారని, నిరంతరం తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలన్నారు. నేడు మన సమాజంలో భావ వ్యక్తికరణకు స్వేచ్ఛ లేదని ప్రజలందరికీ, సమాన హక్కులు లభించడం లేదని, కొండలు తవ్విస్తున్నారని, చెట్లను నరికి వేస్తున్నారని, ఇసుక దోపిడి, మద్యం మాఫియా కొనసాగుతుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. గర్వించదగ్గ తెలుగుజాతి అభివృద్ధిలో వెనుకబడుతున్నదని ,ప్రశ్నించే తత్వం ప్రజలలో పెంపొందించాలని కోరారు. గెలుపే లక్ష్యంగా వందలాది కోట్లు వెచ్చిస్తూ కుల, మత ప్రలోభాలను ప్రేరేపిస్తూ రాజకీయ నేతలు, ఓటర్లను సంతలో వస్తువుగా మారుస్తున్నారని అన్నారు. చట్టసభలలో చట్టాల రూపకల్పనలో ఎలాంటి పాత్ర ఉండటం లేవని అధికారులను బదిలీలపై, దనార్జన పై దృష్టి పెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్ల0 రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ, బూతులు మాట్లాడే రాజకీయ నేతలను పోలింగ్ బూతులు లో తిరస్కరించాలని కోరారు. అధికార యంత్రాంగం, అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి ఓటర్ల జాబితాను లోపభూఇష్టంగా మార్చినారని అన్నారు. ప్రజల సొమ్ముతో వేతనాలు పొందుతున్న వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా, ఎన్నికల సైన్యంగా వాడుకోవాలని భావించడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి భిన్నంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య లంకి శెట్టి బాలాజీ ఆర్ కోటేశ్వరరావు ఎన్ సుందర్రాం కారుమూరి రాజేంద్రప్రసాద్ వేము కోటేశ్వరరావు తంగలవారి బాబు పిబి ఫణికుమార్ పోతురాజు తదితరులు ప్రసంగించారు. రంగం రాజేష్ బృందం ఓటర్ల చైతన్యంపై ఆట మాట పాటలతో సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు సబికులను ఆలోచింపజేశారు