‘రాజ్యాంగం మీద విప్లవ రచయితల సంఘం దాడి విచిత్రం’
x

‘రాజ్యాంగం మీద విప్లవ రచయితల సంఘం దాడి విచిత్రం’

ఈ నెలాఖరున జరుగుతున్న విప్లవ రచయితల సంఘం సభల సందర్భంగా “భారత రాజ్యాంగవాదం “ అనే పేరుతో ఒక అవగాహన ప్రతం విడుదల చేశారు. దానికి జవాబు ఈ వ్యాసం.


- బి ఎస్ రాములు


విప్లవ రచయితల సంఘం (విరసం) ఇటీవల తమ సభలు జరుపుకుంటూ ఒక అవగాహన పత్రం విడుదల చేసింది. అందులో “భారత రాజ్యాంగవాదం “ అనే ప్రబంధాన్ని ప్రత్యేకంగా ప్రసావించింది. బీజేపీ ఆరెసెస్ శక్తులు ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చి మను స్మృతి ని , అసమానతల వర్ణ కుల వ్యవస్థలను వివక్షతలను అమలు చేయడానికి ప్రతి రంగంలో చెట్టుకు వస్తున్నదా. పాఠ్య పుస్తకాలను మార్చింది. భారతీయ శిక్షాసిమృతిని మార్చింది. ఈ దశలో బీసీ ఎస్సీ ఎస్టీలు , మహిళలు, ప్రజాస్వామిక శక్తులు భారత రాజ్యాంగాన్ని పరి రక్షించుకోవాలని ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ దశలో భారత రాజ్యాంగం పై విరసం, విరసం వెనక వున్న శక్తులు భారత రాజ్యాంగం పై తానుకూడా ఓ రాయి విసురుతున్నాయి. అన్ని ప్రజాస్వామిక హక్కులు కావాలని ప్రజల మద్దతు కోరే ఈ శక్తులు రాజ్యాంగం పై దాడి చేయడం, రాజ్యాంగ పరంగా అభివృద్ధి అవకాశాలు అందుకోవాలనుకునే వారిని వారి ఆశలను నీరు కారుస్తూ భారత రాజ్యాంగంపై దాడి చేయడం విచిత్రం. ఇది తాము కూర్చున్నా కొమ్మను తామే నరుక్కోవడం. ఇది అభివృద్ధి అందుకున్న వాల్లకే మరిన్ని అవకాశాలు అప్పగించి అభివృద్ధి అందుకోలేదు పోతున్న వారికి అభివద్ది ఫలాలకు దూరం చేయడం.




వారి భాష , విశ్లేషణ వారు చెప్పే అర్థశాస్త్రం పరిమితికి లోబడి సాగింది.

భారత రాజ్యాంగం అర్థశాస్త్రం కాదు. అది మానవ సంబంధాల శాస్త్రం. ప్రజలు , వారి హక్కులు , ప్రజా ప్రతినిధుల ఎన్నిక, చట్ట సభలు , శాయనాల రూప కల్పన, ఆయా సామాజిక వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కృషి, పరిపాలన వ్యవస్థ, ఆయా ప్రభుత్వ శాఖలు , కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, వాటి పరిధులు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, పౌరసత్వం, ఓటు హక్కు, ప్రభుత్వ పన్నులు , ఆదాయ వనరులలో కేంద్రం, రాష్ట్రం వాటాలు, ఆదివాసీ రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు, కాశ్మీర్ రాష్ట్ర హక్కులు, న్యాయ వ్యవస్థ, జిల్లా, రాష్ట్ర, న్యాయ వ్యవస్థ, సుప్రిం కోర్టు, ఆయా కోర్టులో పరిధులు మొగలైనవి... !! రాజ్యాంగంలో ముఖ్యాంశాలు. 3 అంగాలు 1. చట్ట సభలు 2. పరిపాలన. యంత్రాంగం. 3. న్యాయవ్యవస్థ.
ఇలా మాన సంబంధాల వ్యవస్థ. అంతేగాని భారత రాజ్యాంగం అర్థం శాస్త్రం కాదు. వామ పక్ష మార్క్సిస్టు లు మావోయిస్టులు ఇంతకన్నా మంచి వ్యవస్థ ను ఏర్పాటు చేయాలనుకుంటే ఇదివరకు ఏర్పాటు చేసిన సోవియట్, చైనా , క్యూబా తదితర దేశాల రాజ్యాంగాలతో తులనాత్మక పరిశీలన చేయాలి.
అంతేగానీ అర్థం శాస్త్రంతో రాజ్యాంగం ను చర్చించి కూడదు.
అర్థశాస్త్రం అనేక శాస్త్రాల్లో ఒక శాస్త్రం మాత్రమే!!
వారి అర్థశాస్త్రం, పురుషాధిపత్య పితృస్వామిక పరిమికిలోనైందని సైమన్ దిబోవర్ వంటి ఫెమినిస్టులు చాలా కాలం క్రితమే నిర్దారించారు.
అర్థశాస్త్రవాదం మనిషిని ఆర్థిక సంబంధాల పరిధికి కుదిస్తుంది. ప్రకృతికి మనిషి కి మధ్య సంబంధం అర్థశాస్త్రం పరిధి కాదు. అది తత్వ శాస్త్రం పరిధిలోకి వస్తుంది. తల్లికి శిశువు కు సంబంధం ప్రకృతికి మానవ సంబంధాలకు సంబంధించినది.
స్త్రీ పురుష సంబంధాలు, ప్రేమ వివాహం, కుటుంబం మొదలైనవి , మానవీయ విలువలు , సంస్కృతి, మానవ సమాజ పరిణామాల శాస్త్రం. ఆంత్రోపాలజీ , క్లాన్, ట్రైబ్, జాతి, కులం మొదలైన శాస్త్రాలకు సంబంధించినవి. సైన్సు టెక్నాలజీ సాహిత్యం కళలు ఊహాశక్తి, కల్పన, అవసరాలు, వినోదం, మొదలైన శాస్త్రాలకు సంబంధించిన వి. వీటన్నిటిని రాజ్యాంగం , రాజకీయాలు సమాజ పరిణామాన్ని , స్థాయిని అనుసరించి రెగ్యులేటర్ చేస్తూ నిర్వర్తిస్తుంటాయి.
అనేక శాస్త్రాల కూడలి గా భారత రాజ్యాంగం ఒక మహోన్నత సామాజిక శాస్త్రం.. ! రాజ్యాంగం రూపం లో ఉన్న మహోన్నత సామాజిక శాస్త్రం. మనుషులందరూ సమానమే. ప్రతి మనిషికి ఒకే విలువ ఒకే ఓటు అనే తత్వ శాస్త్రం రాజ్యాంగ అంతస్సారం. ఇంతకు మించిన తత్వ శాస్త్రం ఇంత వరకు పుట్ట లేదు.
లెనిన్ రాజ్యం విప్లవం అనే గ్రంథంలో రెండు ముఖ్యమైన అవగాహన తెలిపాడు.
1. రాజ్యం ను అదృశ్యం చేస్తానని బయలుదేరి అంత కన్న పెద్ద/ బలమైన రాజ్యంగా మారిపోతూ వచ్చింది.
2. ⁠విప్లవం విజయ వంతం అయ్యాక ఇపుడున్న ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను బోల్షవిక్ స్పూర్తితో శిక్షణ ఇచ్చి పని తీసుకుంటాము .
3. భారత జాతీయోద్యమ తర్వాత నెహ్రూ కూడ పాత ఉద్యోగులను, ఉపాధ్యాయులను కొనసాగించారు.
అందువల్ల ఇవాళ విద్య, ఉద్యోగ, నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సైంటిస్టులు విప్లవ విజయం చర్వాత కొత్త ప్రభుత్వంలో కూడ కొనసాగుతారు.

రచయిత బిఎస్ రాములు



అందువల్ల వర్తమానంలో విద్య, ఉద్యోగం అభివృద్ధి అందుకున్నారే రేపు కూడా కొనసాగుతారు. వారి వారసులే సింహ భాగం నూతన అవకాశాలు పొందుతారు. ఏమంటే వారు ఎదిగిన జనరేషన్లు కనక మరింత తొందరగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఇలా ఏ విధంగా చూసినా వర్తమాన అభివృద్ధి అందుకున్నపుడే భవిష్యత్ అవకాశాలు అందుకుంటారు. కొత్తగా ఎదిగే వారికి 20-25 ఏళ్ల విద్య అవసరమవుతుంది. ఇలా ఇపుడు అభివృద్ధి అందుకోలేదని వారు విప్లవం విజయవంతం అయ్యాక అన్ని అవకాశాలు కలిపిస్తే రెండు తరాలు 25 ఏళ్లు ఆలస్యంగా అభివృద్ధి అందుకోవడం సాద్య పడుతుంది.
అందువల్ల ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ంుభారత రాజ్యాంగం ఆసరాతో సమస్త అవకాశాలకోసం , సమస్త రంగాల్లో కృషి చేయడం అవసరం. తద్వారా సంపద అభివృద్ధి చెందుతుంది . జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాల క్రమంలో సాయుధ విప్లవాల అవసరం కూడ కాలం తీరి పోవచ్చు. అందరికి అభివృద్ధి ఫలాలు అందించడానికి రాజ్యాంగాన్ని బడ్జెట్లను చిత్త శుద్ధితో ఉపయోగిస్తే విప్లవాలు అవసరం లేదు. ప్రజాస్వామ్యం సరిగా అమలైన దేశాల్లో ఏదేశంలో కూడా సాయుధ విప్లవాలు విజయవంతం కాలేదు. ప్రెషర్ గ్రూపు గా మిగిలి పోయాయి. విప్లవానంతరం కూడా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న చరిత్ర కళ్ల ముందే వింది. సోవియట్ యూనియన్, తూర్పు యూరపు దేశాలు విప్లవానంతరం తిరిగి ప్రజాస్వామ్యంలోకి వచ్చారు. చరిత్ర నుండి పై విషయాలు గమనించడం అవసరం.
భారత రాజ్యాంగాన్ని , అందులో మనకు మనమే పొందు పరుచుకున్న అవకాశాలను కాపాడుకోవడానికి మనుధర్మ, బీజేపీ, ఆరెసెస్ ప్రాభవ యుగంలో భారత రాజ్యాంగ పరి రక్షణ అందరి కర్తవ్యం.

(బి ఎస్ రాములు, సామాజిక తత్వ వేత్త, బీసీ కమిషన్ తొలి చైర్మన్ తెలంగాణ రాష్ట్రం)


Read More
Next Story