ఇ‌స్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు
x

ఇ‌స్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు

ఇస్రో శాస్త్రవేత్తల ఘనతేంటి? ట్విటర్‌లో ప్రధాని మోదీ వారిని ఎందుకు అభినందించారు?


భారతదేశపు మొట్టమొదటి సోలార్‌ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్‌1 ‌గమ్యస్థానానికి చేరుకుంది. 125 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య ఎల్‌-1 ‌సూర్యుచి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ ‌పాయింట్‌ ‌చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఐస్రో) శాస్త్రవేత్తలకు ట్విట్టర్‌ (ఎక్స్) ‌వేదికగా అభినందనలు తెలిపారు.

‘‘భారతదేశం మరో రికార్డు సృష్టించింది. దేశపు మొట్టమొదటి సోలార్‌ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్‌1 ‌గమ్యాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్ట అంతరిక్ష యాత్ర విజయవంతం చేశారు. ఇది వారి అంకితభావం, ప్రతిభకు నిదర్శనం’’ అని ట్విటర్‌ (ఎక్స్)‌లో ప్రధాని పోస్టు చేశారు.



ఆదిత్య-ఎల్‌1 ‌ప్రయోగంలో లాభాలేంటి?

చంద్రయాన్‌ - 3 ‌మిషన్‌ ‌ఘన విజయం తర్వాత ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయింది. సౌర వాతావరణంపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 వాహక నౌక ద్వారా సెప్టెంబర్‌ 2‌న ప్రయోగించింది. సూర్యుడి వెలుపల పొరలు, ఫొటోస్ఫియర్‌ (‌కాంతి మండలం) క్రోమోస్ఫియర్‌ (‌వర్ణ మండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై ఆదిత్య - ఎల్‌1 అధ్యయనం చేస్తుంది. సౌర వాతావరణంతోపాటు అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణంపై దాని ప్రభావాన్ని ఇది అధ్యయనం చేస్తుందని ఇస్రో వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More
Next Story