బీజేపీతో దోస్తీ.. తమిళనాడులో కలిసి పోటీ చేయనున్న పీఎంకే
x

బీజేపీతో దోస్తీ.. తమిళనాడులో కలిసి పోటీ చేయనున్న పీఎంకే

కమలనాథులు దక్షిణాదిపై గురిపెట్టిన విషయం తెలిసిందే. ఈ సారి వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.


కమలనాథులు దక్షిణాదిపై గురిపెట్టిన విషయం తెలిసిందే. ఈ సారి వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. కలిసివచ్చే వారితో పొత్తు పెట్టుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో అదే జరిగింది. పీఎంకే బీజేపీతో దోస్తీకి జై కొట్టడంతో కమలం పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పీఎంకే (Pattali Makkal Katchi) అధ్యక్షుడు అన్భుమణి రామదాసుతో సమావేశమయ్యారు. సీట్ల పంపకాలపై మంగళవారం ఇద్దరూ కలిసి చర్చిస్తున్నారు.

ఈ సారి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎతో కలిసి పనిచేస్తామని, లోక్‌సభ నియోజకవర్గాలు, అభ్యర్థులను తమ అధ్యక్షుడు త్వరలో ప్రకటిస్తారని పిఎంకె ప్రధాన కార్యదర్శి వడివెల్ రావణన్ తెలిపారు.


అన్నాడీఎంకే NDA నుంచి బయటకు వచ్చిన తర్వాత తమిళనాడులో బీజేపీకి ప్రముఖ కూటమి భాగస్వామి లేకుండా పోయింది. ఇప్పడు PMK జతకట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి .. పీఎంకే, డీఎండీకేతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నారు.

డాక్టర్ అన్బుమణి రామదాస్ మంగళవారం సేలంలో ప్రధానిని కలుస్తారా? అని అడిగిన ప్రశ్నకు సీట్లు ఖరారు చేయడానికి ఆయన కలిసే అవకాశం ఉందని రావణన్ బదులిచ్చారు.

Read More
Next Story