ఎర్రకోట పేలుడుకు ఫరీదాబాద్ లింక్ పై దర్యాప్తు
x

ఎర్రకోట పేలుడుకు ఫరీదాబాద్ లింక్ పై దర్యాప్తు

ఫరీదాబాద్ పేలుడు పదార్థాల స్వాదనం తర్వాత కొన్ని గంటల్లోలనే ఎర్రకోట్ పేలుడు జరిగింది.


సోమవారం నాడు ఫరీదాబాద్ లోని ఒకడాక్టర్ ఇంట్లోస్వాదీనం చేసుకున్న పేలుడురసాయనాలకు, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు సంబంధం ఉందాఅనే దాని మీద పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎందుకంటే స్వాదీనం తర్వాత కొన్ని గంటల్లోనే ‘ఎర్రకోట’ పేలుడుజరిగింది.

ఫరీదాబాద్ లింక్ ?

ఢిల్లీ సరిహద్దులోని ఫరీదాబాద్లో ఒక కాశ్మీరీ వైద్యుడు అద్దెకు తీసుకున్న వసతి గృహం నుండి దాదాపు 360 కిలోల అనుమానిత అమ్మోనియం నైట్రేట్ ,ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల లోపే ఢిల్లీలో పేలుడు సంభవించింది.

హర్యానా పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి, ఫరీదాబాద్ లోని ధౌజ్ ప్రాంతం నుండి డాక్టర్ ముజమ్మిల్ గనైని అరెస్టు చేశారు.

పేలుడులో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించబడిందా అని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తనిఖీ చేస్తోందని, ఇది ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి.

9 కి చేరిన మృతుల సంఖ్య

సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారులో భయంకర పేలుడు సంభవించింది. ఇందులో కనీసం తొమ్మిది మంది మృతి చెందారు. అనేక వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.

ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించారని, ఒక మృతదేహాన్ని ఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరిని ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన 34 ఏళ్ల అశోక్ కుమార్, ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల అమర్ కటారియాగా గుర్తించారు. మిగిలిన వారి వయస్సు 28 నుంచి 58 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో జరిగిన ఈ పేలుడులో ఇద్దరు మహిళలు సహా ఇరవై మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. గాయపడిన వారిని సమీపాన ఉన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ (LNJP) ఆసుపత్రికి తరలించారు. పేలుడు స్థలాన్ని పరిశీలించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా మాట్లాడుతూ, సాయంత్రం 6.52 గంటలకు పేలుడు సంభవించిందని తెలిపారు.
పేలుడు జరిగిన కారు(HR267674) లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, ఇది ఆత్మాహుతి దాడినా కాదా అని కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు కూర్చున్న కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. గాయపడిన వారి శరీరంలో ఎటువంటి పెల్లెట్ లేదా పంక్చర్ కనిపించలేదు, ఇది పేలుడులో అసాధారణం. మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము, "అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తరువాత, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా అదే అన్నారు.
పేలుడు శబ్దం చెవులు చిల్లులు పెడేంతపెద్దగా ఉందని, కొన్ని నిమిషాల తర్వాత కూడా తమకు ఏమీ స్పష్టంగా వినిపించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు శబ్దం అనేక మీటర్ల దూరంలో పార్క్ చేసిన వాహనాల కిటికీ అద్దాలను, ఎర్రకోట మెట్రో స్టేషన్ గాజు పలకలను పగలగొట్టింది.
కారు యజమాని అరెస్టు
ఢిల్లీ పోలీసులు కారు యజమాని మొహమ్మద్ సల్మాన్ను సాయంత్రం ఆలస్యంగా అదుపులోకి తీసుకుని వాహనం గురించి ప్రశ్నించగా, అతను దానిని ఓఖాలోని దేవేంద్ర అనే వ్యక్తికి ఒకటిన్నర సంవత్సరాల క్రితం విక్రయించినట్లు చెప్పినట్లు ఒక అధికారి తెలిపారు. తరువాత, ఆ వాహనాన్ని అంబాలాలోని వేరొకరికి విక్రయించారు. దానిని మళ్ళీ పుల్వామాలో తారిక్ అనే వ్యక్తికి విక్రయించారు. పోలీసులు ఆ వ్యక్తులకోసం వెతుకుతున్నారని అధికారి తెలిపారు.

ఆర్డీఎక్స్ వాసనలేదు

ఇంకా, సంఘటనా స్థలంలో ఎలాంటి RDX వాసన కనిపించలేదు. అయినా సరే అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. బాంబు బృందం పేలుడు జరిగిన ప్రదేశంలో డిటోనేటర్లు, ఏదైనా బాంబు తయారీ పదార్థం ఉందా అని కూడా తనిఖీ చేస్తుందని వారు తెలిపారు.

పేలుడు స్థలాన్ని సందర్శించి, LNJP ఆసుపత్రిలో బాధితులను కలిసిన అమిత్ షా, పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీ పోలీసు చీఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ మాట్లాడారు.

LNJP హాస్పిటల్ పంచుకున్న జాబితా ప్రకారం, ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరియు 18 మంది పురుషులు సహా మొత్తం 20 మంది గాయపడ్డారు. వారిలో 12 మంది ఢిల్లీ నివాసితులు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందినవారు. గాయపడిన అతి పిన్న వయస్కుడిని ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ కు చెందిన 21 ఏళ్ల శివం ఝాగా గుర్తించారు.

పేలుడు తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పరిస్థితిని సమీక్షించి, మృతులకు సంతాపం తెలిపారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.

పేలుడు సంభవించడానికి ముందు వాహనం ప్రయాణించిన మార్గాన్ని గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను స్కాన్ చేస్తున్నారు. వారు స్థానికులను ప్రశ్నిస్తున్నారు మరియు సంఘటనకు ముందు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం పంచుకోవాలని ప్రత్యక్ష సాక్షులను అడుగుతున్నారు. మొబైల్ డంప్ డేటాను సేకరిస్తున్నారుజః. అనుమానిత ఉగ్రవాదుల పత్రాలను స్కాన్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు, ఒక ఆటోరిక్షా దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు.


Read More
Next Story