KCR Nandinagar House
x
KCR residence Nandinagar area

నందినగర్ ను సీజ్ చేసిన పోలీసులు

కార్యకర్తలు ఎలాంటి దాడులకు పాల్పడకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి రోడ్లను సీజ్ చేశారు


టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారించటంలో భాగంగా పోలీసులు నందినగర్ లోని చుట్టుపక్కల ప్రాంతాలను సీజ్ చేశారు. బంజారాహిల్స్ లోని క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు నుండి కేసీఆర్ ఇంటికి మధ్యలో ఉన్న అన్నీ రోడ్లను పోలీసులు బ్లాక్ చేసేశారు. అలాగే (KCR)కేసీఆర్ ఇంటికి చుట్టుపక్కల ఉన్న రోడ్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా సిట్(SIT) అధికారులపై బీఆర్ఎస్(BRS) నేతలు, కార్యకర్తలు ఎలాంటి దాడులకు పాల్పడకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి రోడ్లను సీజ్ చేశారు. ఎవరినీ రోడ్లపైన తిరగనీయటంలేదు. విచారణ సందర్భంగా రోడ్లను సీజ్ చేసిన కారణంగా స్ధానికులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తిచేశారు.

మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ మొదలవ్వాల్సుండగా మధ్యాహ్నం 12.30 గంటలకే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ నందినగర్ లోని తనింటికి చేరుకున్నారు. ఇంట్లో కేసీఆర్ తో పాటు కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు కూడా ఉన్నారు. కేసీఆర్ ఇంటికి చేరుకునే సమయానికే సిట్ అధికారులు కూడా చేరుకున్నారు. ఇంట్లోని రెండో అంతస్తులో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన విచారణ ఇంకా నడుస్తునే ఉంది. కేసీఆర్ ను సిట్ విచారించటానికి నిరసనగా బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ రాష్ట్రమంతా ఆందోళనలు చేస్తున్నారు.

గ్రామస్ధాయితో మొదలుపెట్టి మండల కేంద్రాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసుపేరుతో కేసీఆర్ పైన తప్పుడు కేసులు బనాయించి రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని కారుపార్టీ నేతలు నానా గోలచేస్తున్నారు. ఇంతకుముందే సిట్ అధికారులు కేటీఆర్, హరీష్, సంతోష్ ను కూడా చెరో ఏడుగంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. వయసు, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ను ఎన్నిగంటలు విచారిస్తారో చూడాలి.

Read More
Next Story