కర్ణాటకలో ‘ఫ్లాగ్‌పోల్‌’ చుట్టూ రాజకీయాలు
x

కర్ణాటకలో ‘ఫ్లాగ్‌పోల్‌’ చుట్టూ రాజకీయాలు

కర్ణాటకలో ఫ్లాగ్‌పోల్‌ (జెండా స్తంభం) వ్యవహారం అగ్గి రాజేస్తుంది. హనుమంతుడి బొమ్మ ఉన్న కాషాయ జెండాను ఎగరేయడం, తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


అసలు ఏం జరిగింది..

కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా సమీపంలోని కెరగోడు గ్రామంలో గ్రామస్థులు ఆదివారం 108 అడుగుల ఎత్తైన ఫ్లాగ్‌పోల్‌పై హనుమాన్‌ బొమ్మను కషాయ జెండాను ఎగురవేశారు. అయితే ఫ్లాగ్‌పోల్‌పై జాతీయ జెండా లేక కన్నడ జెండాను మాత్రమే ఎగరేయడానికి అనుమతినిచ్చారు అధికారులు. అందుకు విరుద్ధంగా కషాయ జెండా ఎగురవేయడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది దాన్ని తొలగించారు. దీంతో గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బీజేపీ జేడీ(ఎస్‌), భజరంగదళ్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాషాయ జెండాలు పట్టుకుని మండ్య జిల్లా కేంద్రంలోని డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయానికి ప్రదర్శనగా బయలుదేరారు.

బారికేడ్లు, సీసీటీవీలు ఏర్పాటు..

కెరగోడులో ఆదివానం పరిస్థితి ఉద్రిక్తంగా మారండంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.అవాంఛనీయ ఘటనలు జరగకుండా

జెండా స్తంభం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అమర్చారు. అంతకుముందు నిరసనకారులు బంద్‌కు పిలుపునివ్వడంతో గ్రామంలో దుకాణాలు, సంస్థలు మూతపడ్డాయి.

సోమవారం నిరసనలు జిల్లా కేంద్రాలకు వ్యాప్తించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘హిందూ వ్యతిరేక విధానాన్ని’ అవలంభిస్తోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెంగళూరులో జయనగర ఎమ్మెల్యే సీకే రామమూర్తి ఆధ్వర్యంలో మైసూరు బ్యాంక్‌ సర్కిల్‌ వద్ద బీజేపీ నిరసనకు దిగింది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఎన్నికలలో లబ్దిపొందేందుకే..

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం ఆరోపించారు. కాషాయ జెండా తొలగింపుపై ప్రజలను రెచ్చగొట్టి ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్‌) లబ్దిపొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

జాతీయ, కన్నడ జెండాలను మాత్రమే ఎగురవేసేందుకు అనుమతి తీసుకున్నందున అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తాను హిందూ వ్యతిరేకినని ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అయితే తాను హిందువునని, అన్ని మతాలవారిని ప్రేమిస్తానని చెప్పారు.

‘‘బీజేపీ తమ ఎజెండాను ప్రచారం చేసుకునేందుకు అనవసరంగా గోడవలు సృష్టిస్తోంది. జాతీయ జెండా లేదా కన్నడ జెండాను ఎగురవేయడానికి అనుమతి తీసుకున్నారు. మేము ఏ జెండాకు వ్యతిరేకం కాదు. రేపు డీసీ (డిప్యూటీ కమీషనర్‌) కార్యాలయంపై కాషాయ జెండా ఎగురవేయాలని వారు కోరవచ్చు. అది కుదరదు కదా.అనుమతి తీసుకున్న జెండాను ఎగురవేయాలి. అందుకు విరుద్దంగా చేశారు. అందుకే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది అని సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు.

బీజేపీ, జేడీ(ఎస్‌) ప్రమేయం?..

రంగమందిర సమీపంలో జెండా ఏర్పాటుకు కొన్ని సంస్థలతో పాటు కెరగోడు, చుట్టుపక్కల 12 గ్రామాల నివాసితులు నిధులు సమకూర్చారని ఇందులో బీజేపీ, జేడీ(ఎస్‌) కార్యకర్తలు ప్రమేయం ఉన్నట్లు అధికారిక, పోలీసు వర్గాల సమాచారం.

‘‘వారు హనుమంతుని చిత్రంతో కూడిన కాషాయ జెండాను ఎగురవేశారు. కొంతమంది వ్యక్తుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నాం. జెండాను తొలగించాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించాం’’అని పంచాయతీ కార్యనిర్వహణాధికారి అన్నారు. ఎట్టకేలకు పోలీసులు, గ్రామ పంచాయతీ అధికారులు ఎట్టకేలకు కషాయ జెండాను తొలగించి ఫ్లాగ్‌పోల్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Read More
Next Story