విశాఖలో కనువిందు చేసిన ఓడల మేళా
x

విశాఖలో కనువిందు చేసిన ఓడల మేళా

ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు (ఫిబ్రవరి 18, 2026) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళాల ( International Fleet Review) సమీక్షను వీక్షించారు. ‘అంతర్జాతీయ నౌకాదళాల సమీక్ష, 2026’ లో 71 కి పైగా దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి. మొత్తం 71 యుద్ధ నౌకలు ఫ్లీట్ రివ్యూ లో పాల్గొంటున్నాయి. ఇందులో 45 భారత్ నౌకాదళానికి చెందినవే.మిగతా వాటిలో 10 ఇతర మిత్ర దేశాలనుండి వచక్చాయి. భారత ఫ్లీట్ లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియా షిప్పింగ్ కార్పొరేషన్ నౌకలు కూడా ఉన్నాయి.


వివిధ జెండాలు కలిగిన నౌకల, వివిధ దేశాల నావికుల ప్రదర్శన ఐక్యతా స్ఫూర్తి అని ఈ సందర్భంగా మాట్లడుతూ అన్నారు. సముద్ర రంగంతో సహా అంతర్జాతీయ సంబంధాల కోసం భారతదేశం అనుసరిస్తున్న విధానం 'వసుధైవ కుటుంబకం' లేదా 'ప్రపంచం ఒక కుటుంబం' అని రాష్ట్రపతి అన్నారు.


సమిష్టిగానే ప్రపంచ భద్రత, వృద్ధి, స్థిరత్వం స్థిరత్వం నిర్మించబడతాయనే సత్యాన్ని ఈ విధానం ప్రతిబింబిస్తుందని ఈ భాగస్వామ్య స్ఫూర్తి శాశ్వత ప్రపంచ విధానానికి(global order) పునాది వేస్తుందని ఆమె అన్నారు. అందువల్ల, మంచి సముద్ర విధానం (maritime order) అనేది సమిష్టి బాధ్యత మరియు సారూప్య దృక్పథం కలిగిన భాగస్వాముల మధ్య సహకార చర్యపై ఆధారపడి ఉంటుందని భారతదేశం విశ్వసిస్తుంది. ఈ ఫ్లీట్ రివ్యూ భారతదేశం యొక్క మహాసాగర్ (Mahasagar) దార్శనికతను కూడా ముందుకు తీసుకెళ్తుందని ఆమె పేర్కొన్నారు.


భారతదేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో, విస్తృత సముద్ర ఉమ్మడి ప్రాంతాలలో స్థిరత్వానికి దోహదపడటంలో భారత నావికాదళం అప్రమత్తంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. ఈ ప్రాంతంలో మోహరించబడిన భారత నావికాదళ యూనిట్లు సముద్రాలలో తలెత్తే ముప్పులకు సవాళ్లకు నివారించేందుకు విశ్వసనీయ సాధనాలుగా పనిచేస్తున్నాయని ఆమె కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.


Read More
Next Story