తెల్ల బంగారానికి ధరల‌ తెగులు
x

తెల్ల బంగారానికి ధరల‌ 'తెగులు'

సీజనింకా పీక్ కి రాకముందే తెలంగాణలో తెల్ల బంగారం ధరలు దారుణంగా పడిపోయాయి. "పత్తి ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం పత్తి వ్యాపారులు సిండికేట్ కావడం.


సీజనింకా పీక్ కి రాకముందే తెలంగాణలో తెల్ల బంగారం ధరలు దారుణంగా పడిపోయాయి. "పత్తి ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం పత్తి వ్యాపారులు సిండికేట్ కావడం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనల పేరిట రైతుల్ని వేధింపులకు గురిచేసి రైతులే ఎంతోకొంత కు తెగబడి అమ్ముకునేలా చేయడం. ఇది వ్యాపారుల వ్యూహం" ఇదీ తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి చెబుతున్న మాట.

పత్తి వ్యాపారులు సిండికేట్ కావడం అంటే ఏమిటి? ఎందుకు సిండికేట్ అవుతారు? ఈ లెక్కలు తేలాలంటే మనం ఒక్కసారి కరీంనగర్ పత్తి మార్కెట్ కి వెళ్ళాలి. ఇక్కడ జరుగుతున్న తతంగం చూసినప్పుడు పత్తి వ్యాపారులు సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన నిబంధనలను రైతుల ముందు పెట్టి ధరలలో ఊతకోత కోస్తున్నారన్నది మల్లాపురం రైతు చీకట్ల సురేష్ చెబుతున్న మాట. ఈ పరిస్థితి రైతులకు అర్థం కావచ్చు కానీ వ్యాపారులకు బాగానే తెలుసు. నిన్న మొన్నటి వరకు 8500 రూపాయలు ఉన్న పత్తి క్వింటాల్ ధర ఈవేళ 6593 రూపాయలకు పడిపోయింది. ఈ పరిస్థితి పై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత సీజన్‌లో రూ. 12 వేలపై మాటే...

గత సీజన్‌లో క్వింటాల్‌కు 12 వేల నుంచి 14 వేల వరకు పలికిన పత్తి ధర.. ఈసారి 7 వేల రూపాయలకు మించట్లేదు. వ్యవసాయ మార్కెట్లకు తీసుకెళ్లిన కూడా.. తేమశాతం పేరుతో ధరల్లో కోతలు పెడుతున్నారని పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. మాయిశ్చర్‌ రీడింగ్​ 8 నుంచి 12 వరకు ఉంటేనే గరిష్టంగా 7 వేల వరకు చెల్లిస్తోంది. ఇదే అదునుగా భావించి.. ప్రైవేట్ వ్యాపారులు సిండికెట్ అయి రైతుల పొట్ట కొడుతున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బేళ్లు, గింజల ధరలు పడిపోయాయంటూ 6 వేల 600 చొప్పున కొనుగోళ్లు చేస్తున్నారని.. దీంతో పత్తిని అమ్మితే లాభం కంటే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తిలో టాప్‌ కరీంనగర్...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట, పెద్దపల్లి మార్కెట్లకు రైతులు పత్తిని ఎక్కువగా తీసుకువెళ్తారు. వానాకాలం సీజన్‌లో పత్తి సాగు గణనీయంగా తగ్గింది. మరోవైపు.. వర్షాలు ఆలస్యం కావడంతో పత్తి అనుకున్నంత సాగుకాలేదు. జులైలో ముంపు, ఆగస్టులో నీటి ఎద్దడి కారణంగా దిగుబడులు కూడా గణనీయంగా పడిపోయాయి. సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తికి 8 వేల 200 నుంచి 8వేల 500 దాకా పెట్టిన వ్యాపారులు పది రోజులుగా 6వేల 900 నుంచి 6వేల 600 వరకు చెల్లిస్తున్నారు.

తెలంగాణలో సగటున తగ్గిన సాగుబడి...

65 నుంచి 70 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా... వర్షాల కారణంగా 45 లక్షల ఎకరాల్లో సాగు అయ్యింది. గత రెండు మూడేళ్లతో పోల్చితే రాష్ట్రంలో పత్తి సాగు భారీగా తగ్గింది. పరిస్థితులు అనుకూలించక వచ్చిన అరకొర దిగుబడికి గతేడాది పలికినట్లు క్వింటాలుకు 14 వేల రూపాయల ధర పలుకుతుందని రైతులు వేసుకున్న అంచనాలు తారుమరయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ పేరు చెప్పి వ్యాపారులు 7 వేల కంటే తక్కువ ధరను చెల్లిస్తున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో పత్తి అమ్ముకుంటే లాభం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Read More
Next Story