ప్రైవేట్ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు పోతున్నాయి!
25 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారంటున్న RBI, కారణం...
దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల తొలగింపు దాదాపుగా 25 శాతంగా ఉందని, ఈ కార్యాచరణ భవిష్యత్ లో ప్రమాదకారంగా ఉండబోతోందని ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. 2023-24 కు సంబంధించి బ్యాంకింగ్ ట్రెండ్ అండ్ పురోగతిపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాలను సంస్థ తెలియజేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (SFBs)లో ఉద్యోగుల తొలగింపు రేట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి.
ప్రైవేట్ బ్యాంకుల మొత్తం ఉద్యోగుల సంఖ్య 2023-24లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) కంటే ఎక్కువగా ఉంది, అయితే వారి అట్రిషన్ గత మూడేళ్లలో బాగా పెరిగింది, సగటు అట్రిషన్ రేటు దాదాపు 25 శాతంగా ఉందని తెలియజేసింది.
" అధిక అట్రిషన్ - ఉద్యోగుల టర్నోవర్ రేటు సంస్థాగత బేస్ కోల్పోవడానికి కారణం అవుతుందని, దీనికి ప్రధాన కారణం పెరిగిన ఖర్చు అని నివేదిక లో ద్రవ్య బ్యాంకు పేర్కొంది. దీనివల్ల వినియోగదారుల సేవల్లో అంతరాయాలు కలుగుతుందని అంతిమంగా ఇది బ్యాంకింగ్ రంగానికి నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడింది.’’
బ్యాంకులు మెరుగైన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలు, విస్తృతమైన శిక్షణ, కెరీర్ అభివృద్ధి అవకాశాలను అందించడం, మెంటార్షిప్ ప్రోగ్రామ్‌లు, పోటీతత్వ ప్రయోజనాలు, ఉద్యోగులతో దీర్ఘకాలిక బాండింగ్ వంటివి కొనసాగించాలని సూచించింది.
టాప్-అప్ లోన్లతో సహా బంగారు ఆభరణాల రుణాల మంజూరులో అనేక అవకతవకలు గమనించిన దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ తమ పాలసీలు, ప్రక్రియలు, బంగారు రుణాలపై ఉన్న పద్ధతులను సమగ్రంగా సమీక్షించాల్సిందిగా పర్యవేక్షిస్తున్న సంస్థలకు సూచించింది. ఈ సంస్థలు తమ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలను నిశితంగా పర్యవేక్షించాలని, ఔట్సోర్సింగ్ కార్యకలాపాలు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల తో తగిన విధంగా నిర్ధారించుకోవాలని సూచించింది.
వాతావరణ మార్పు ప్రమాదాలు ఆర్థిక సంస్థల లాభదాయకత, వృద్ధి అవకాశాలు, ద్రవ్యోల్బణం అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని, తద్వారా ఆర్థిక స్థిరత్వం - ధర స్థిరత్వంపై ప్రభావం చూపుతాయని నివేదిక పేర్కొంది. నియంత్రిత సంస్థల ద్వారా ఈ ఆందోళనలను అంచనా వేయడానికి, రెగ్యులేటరీ - సూపర్వైజరీ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించి క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొంది.
Next Story