
ప్రియాంక గాంధీ
ఇజ్రాయెల్ పై విమర్శలు గుప్పించిన ప్రియాంక గాంధీ
గట్టి కౌంటర్ ఇచ్చిన టెల్ అవీవ్, 50 ఏళ్లలో 450 శాతం గాజా జనాభా పెరిగిందన్న రూవెన్ అజార్
గాజాపై ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ఇజ్రాయెల్ జెనోసైడ్ కు పాల్పడుతోందని ఆరోపించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడి చేస్తున్నప్పటికీ భారత ప్రభుత్వం మౌనం వహిస్తోందని విమర్శించారు.
ఇజ్రాయెల్ పై..
‘‘ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోంది. 60 వేల మందికి పైగా ప్రజలను హత్య చేసింది. వారిలో 18,430 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా అనేకమందిని ఆకలితో చంపివేసింది. లక్షలాది ఇప్పటికి ఆకలితో అలమటిస్తున్నారు.’’ అని వయనాడ్ ఎంపీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మౌనం, నిష్క్రియాత్మకత వహించి ఈ నేరాలకు వీలు కల్పించడం కూడా నేరమే అని ప్రియాంక, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ఈ విధ్వంసాన్ని చేస్తుంటే భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటు’’ అని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
జర్నలిజం స్ఫూర్తి..
ఐదుగురు జర్నలిస్టులపై ఐడీఎఫ్ దాడి చేసి హతమార్చిన సంఘటనపై కూడా ప్రియాంక మరో పోస్ట్ చేశారు. అల్ జజీరా జర్నలిస్టుల క్రూరమైన హత్య పాలస్తీనా గడ్డపై జరిగిన మరో దారుణమైన నేరమని, సత్యం కోసం నిలబడటానికి ధైర్యం చేసే వారి అపరిమిత ధైర్యం ఇజ్రాయెల్ చేసే హింస, ద్వేషం వల్ల ఎప్పటికీ విచ్చిన్నం కాదని ట్వీట్ చేశారు.
‘‘మీడియాలో ఎక్కువ భాగం అధికారం, వాణిజ్యానికి బానిసలైన ప్రపంచంలో ఈ ధైర్యవంతులు నిజమైన జర్నలిజం అంటే ఏమిటో మనకు గుర్తు చేశారు. వారు శాంతితో విశ్రాంతి తీసుకుంటున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.
అల్ జజీరా మీడియా నెట్ వర్క్ ప్రకారం.. గాజా నగరంలో జర్నలిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్న టెంట్ పై ఇజ్రాయెల్ జరిపిన లక్ష్యంగా జరిగిన దాడిలో జర్నలిస్ట్ అనాస్ అల్ షరీఫ్, మరో నలుగురు జర్నలిస్టులు మృతి చెందారు. అయితే అనాస్ హామాస్ లోని ఒక తీవ్రవాద విభాగానికి అధిపతి అని ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పౌరులు, సైన్యంపైకి రాకెట్ దాడులకు నేతృత్వం వహించారని ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రియాంక కు కౌంటర్ ఇచ్చిన ఇజ్రాయెల్
ప్రియాంక వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారీ రూవెన్ అజార్ స్పందిస్తూ .. ‘‘నీ మోసం సిగ్గుచేటు. ఇజ్రాయెల్ 25 వేల మంది హమాస్ తీవ్రవాదులను హతమార్చింది. హమాస్ పౌరులను షీల్డ్ గా ఉపయోగించుకుని దాడులు చేసింది, ఆత్మరక్షణలో భాగంగా చేసిన దాడుల్లో పౌరులు మరణించారు’’ అని పేర్కొంది
ఇజ్రాయెల్ ఇప్పటి వరకూ 2 మిలియన్ టన్నుల ఆహారాన్ని సరఫరా చేసింది హమాస్ వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆకలి రాజ్యం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
ఇజ్రాయెల్ ఇప్పటికి మానవత కార్యక్రమాలను చేస్తోందని చెప్పారు. గత 50 సంవత్సరాలలో గాజా జనాభా 450 శాతం పెరిగిందని, ఇక్కడ జాతి హననం జరిగిందని ఎట్లా చెప్తారని ప్రియాంకను ప్రశ్నించారు. హామాస్ చెప్తున్నా సంఖ్యలను నమ్మవద్దని అంతర్జాతీయ సమాజానికి ఒక హెచ్చరికతో ఆయన ముగించారు.
Next Story