అయోధ్య నగర ఊరేగింపులో ’రామ్‌లల్లా’ కనిపించడా?
జనవరి 17న అయోధ్యలో నిర్వహించే ఊరేగింపులో ‘రామ్‌లల్లా’ ఉండడని ట్రస్టు సభ్యులు ఎందుకు ప్రకటించారు?ఈ నిర్ణయానికి కారణాలేంటి?
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అంతకంటే ముందు జనవరి 17న గర్భాలయంలో ప్రతిష్టించే బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహాన్ని అయోధ్య వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లాలని ఆలయ ట్రస్టు సభ్యులు తొలుత నిర్ణయించారు. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా రోడ్ల మీదకు చేరుకోవడం, ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ మేరకు ట్రస్టు సభ్యులు ఒక ప్రకటన చేశారు. గర్భాలయంలో ప్రతిష్టించే రామ్‌లల్లా విగ్రహాన్ని కాకుండా రాముడి మరో విగ్రహంతో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు కాశీలోని ఆచార్యులు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story