ప్రముఖులకు షాక్ ఇచ్చిన ఓటర్లు.. ఎవరెవరు ఓడారంటే..
x

ప్రముఖులకు షాక్ ఇచ్చిన ఓటర్లు.. ఎవరెవరు ఓడారంటే..

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి విజయదుందుభి మోగించింది. అయితే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ఈసారి ఓటమి పాలయ్యారు. వారిలో..


సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయదుందుభి మోగించింది. గత ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ తగ్గినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదనేది వాస్తవం. అయితే ఈ సారి ఎన్నికల్లో కొంతమంది ప్రముఖులు ఓటమి పాలయ్యారు. ఓడిన వారిలో కేంద్రమంత్రులు, ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు.

ఓడిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురంచి. ఆమెను కాంగ్రెస్ పార్టీ కుటుంబ వీర విధేయుడు అయిన కిషోరి లాల్ శర్మ అమేథిలో ఓడించారు. గత ఎన్నికల్లో రాహూల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించి జాయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఇరానీకి ఓటమే ఎదురయింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం శర్మకు 5,39,228 ఓట్లు రాగా, ఇరానీకి 3,72,032 ఓట్లు వచ్చాయి.

పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ స్థానం నుంచి పోటీ చేసిన గత లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధరి(కాంగ్రెస్), మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన ఈ స్థానం నుంచి 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికి ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన అధిర్ కు ఏడో ఎన్నికల్లో బ్రేక్ పడింది. ఆయన 85 వేల ఓట్లతో ఓడిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర మంత్రి, ఖేరీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన అజయ్ కుమార్ తేని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఉత్కర్ష్ వర్మ మధుర్ చేతిలో 34,329 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
సుల్తాన్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీపై ఎస్పీ అభ్యర్థి రాంభూల్ నిషాద్‌ 43,174 ఓట్ల తేడాతో గెలుపొందడం ఇక్కడ తీవ్ర కలకలం రేపింది. దక్షిణాదిలో బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడులో ఆ పార్టీ లోక్ సభ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నామలై కుప్పుసామి కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్‌పై 1,18,068 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలు ఉన్న లోక్‌సభలో 240 సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, గతసారి సాధించిన 303 మార్కుకు ఇది చాలా దూరంలో ఉంది.
Read More
Next Story