‘పశ్చిమ బెంగాల్‌లో డబుల్ ఇంజన్ సర్కారుతోనే హిందువులకు రక్షణ’
x

‘పశ్చిమ బెంగాల్‌లో డబుల్ ఇంజన్ సర్కారుతోనే హిందువులకు రక్షణ’

పశ్చిమ బెంగాల్‌లో "డబుల్ ఇంజన్ సర్కార్" తీసుకువస్తామన్నారు బీజేపీ నాయకుడు సువేందు అధికారి. మమతా పాలనకు ముగింపు పలికేందుకు తమ పార్టీ కృషి చేస్తోందని అన్నారు.


పశ్చిమ బెంగాల్‌లో "డబుల్ ఇంజన్ సర్కార్" తీసుకువస్తామన్నారు భారతీయ జనతా పార్టీ నాయకుడు సువేందు అధికారి. రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికేందుకు తమ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సందేశ్‌ఖాలీ బ్లాక్‌లో కొనసాగుతున్న నిరసనల గురించి సువేందు మాట్లాడారు. అధికార ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ హిందువులపై హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. " పశ్చిమ బెంగాల్‌లోని TMC ప్రభుత్వంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారు. బంగ్లాదేశ్ వలసదారులను రాష్ట్రంలోకి ప్రవేశించి స్థిరపడిపోతున్నారు. నెమ్మదిగా పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాదేశ్‌లో ఒక భాగంగా చేస్తుంది. " అని విమర్శించారు.

సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలపై లైంగిక హింస, భూకబ్జా ఘటనలు పెరిగిపోయాయని, వాటిపై JNUలోని విద్యార్థులు తమ గళాన్ని పెంచాలని మాజీ TMC నాయకుడు సువేందు అధికారి కోరారు.

"కీలక విషయాలకు చర్చా కేంద్రంగా జెఎన్‌యు ఉంది. పశ్చిమ బెంగాల్‌లో ప్రజా వ్యతిరేక విధానాలు, కార్యక్రమాలపై (విద్యార్థులు) తమ గళాన్ని వినిపించాలి" అని సూచించారు.

TMC నాయకుడు షాజహాన్ షేక్, అతని మద్దతుదారులపై భూ ఆక్రమణ, లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా సందేశ్‌ఖాలీ ప్రాంతంలో అలజడి నెలకొన్న విషయం తెలిసిందే.

Read More
Next Story