దుబాయ్ లో చిక్కుకుపోయిన పీవీ సింధు, మంచు విష్ణు
x
Dubal Air Port

దుబాయ్ లో చిక్కుకుపోయిన పీవీ సింధు, మంచు విష్ణు

దుబాయ్, బహ్రయిన్, కువాయిట్, మస్కట్, అబూదాబీ లాంటి అనేక దేశాల్లోని విమానాశ్రయాలను మూసేశారు.


గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కోట్లాదిమందిలో భయోత్సాతాన్ని సృష్టిస్తోంది. భారత కాలమానం ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన మొదలుపెట్టిన యుద్ధం ప్రస్తుతం యావత్ గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుండి తెలుగురాష్ట్రాలకు వచ్చేయాలని అనుకున్నా కుదరటంలేదు. కారణం ఏమిటంటే దాదాపు దుబాయ్, బహ్రయిన్, కువాయిట్, మస్కట్, అబూదాబీ లాంటి అనేక దేశాల్లోని విమానాశ్రయాలను మూసేశారు.

ఈ నేపధ్యంలోనే అంతర్జాతీయ షటిల్ బ్యాటర్ పీవీ సింధు, తెలుగు సినీ హీరో మంచు విష్ణు దుబాయ్ లో చిక్కుకుపోయారు. హైదరాబాద్ రావటానికి దుబాయ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సింధు బృందంకు ఒక్కసారిగా షాక్ కొట్టింది. ఎందుకంటే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సమీపంలోనే మిస్సైళ్ళు, బాంబులు పడ్డాయి. మిస్సైళ్ళ దెబ్బకు విమానాశ్రయం చిగురుటాకులా వణికిపోయిందని స్వయంగా సింధునే తన ట్విట్టర్లో పోస్టుచేశారు. మిసైల్ దెబ్బకు విమానాశ్రయం సమీపంలో మంటలు, పొగలు, భవనాల కూల్చివేతలకు సంబంధించిన డెబ్రిస్ ఒక్కసారిగా పైకి లేచినట్లు సింధు చెప్పారు.

మిస్సైల్ పేలుళ్ళదెబ్బకు విమానాశ్రయంలో ఉన్న తామంతా తీవ్ర ఆందోళనకు గురయ్యామన్నారు. విమానాశ్రయంలో తలదాచుకోవటానికి ఎటు వెళ్ళాలో కూడా అర్ధంకాలేదని సింధు ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే విష్ణు బసచేసిన ఏరియా పైన మిస్సైళ్ళ ఎగురుతుండటాన్ని విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేశారు. ఇలాంటి భయానక వాతావరణాన్ని గతంలో తాను ఎన్నడూ చూడలేదని పోస్టుచేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసేసిన కారణంగా వేలాదిమంది జనాలు తమ స్వస్ధలాలకు చేరుకునే అవకాశాలు లేక విమానాశ్రయాల్లోనే దాదాపు 20 గంటలుగా అల్లాడిపోతున్నారు.

గల్ఫ్ దేశాల్లో తెలుగువాళ్ళు లక్షలమంది పనిచేస్తున్నారు. అలాగే హైదరాబాద్ తో ఇరాన్ కు వందల సంవత్సరాలుగా విడదీయరాని సంబంధాలున్నాయి. హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ అయిన ఇరానీ చాయ్, ఇరాని బిస్కట్లు, ఇరానీ కేఫ్, ఇరానీ దమ్ బిర్యానీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సడెన్ గా మొదలైన యుద్ధం కారణంగా యావత్ గల్ఫ్ దేశాల్లోను యుద్ధవాతావరణం కమ్ముకునేసింది. ఫలితంగా చాలాదేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలనుండి ఇతర దేశాలకు రాకపోకలు ఆగిపోయాయి. దీనివల్ల తమ వాళ్ళకు ఏమవుతుందో అనే భయం తెలుగురాష్ట్రాల్లో అంతకంతకు పెరిగిపోతోంది.

Read More
Next Story