
పీవీ సింధు సేఫ్.. ఇంటికొచ్చేసిన షట్లర్
గ్రౌండ్ స్టాఫ్, దుబాయ్ అధికారులు, విమానాశ్రయ అధికారులు, ఎమిగ్రేషన్ ఇలా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పిన సింధు.
పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ యుద్ధ వాతావరణం కారణంగా విదేశాల్లో అనేక మంది భారతీయులు ఇరుక్కుపోయి ఉన్నారు. ఇటీవల భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ కూడా తాను దుబాయ్‌లో చిక్కుకుపోయానని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. కాగా తాజాగా ఆమె సేఫ్‌గా ఇంటికి తిరిగి వచ్చేశారు. ఈ విషయాన్ని కూడా ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నారు. మంగళవారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నట్లు సిందూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
‘‘ఇంటికి సేఫ్‌గా చేరుకున్నా. గడిచిన కొన్ని రోజులు చాలా భయంగాను, అనిశ్చిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. గ్రౌండ్ స్టాఫ్, దుబాయ్ అధికారులు, విమానాశ్రయ అధికారులు, ఎమిగ్రేషన్ ఇలా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ప్రతి ఒక్కరు అడుగడగునా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ కష్టకాలంలో మాకు వెన్నంటి ఉండి మాకు ధైర్యం చెప్పారు. మిమ్మల్ని తిరిగి పంపడంలో ప్రతి ఒక్కరూ తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. వాళ్ల ఎంపతీ, ప్రొఫెషనలిజమ్ నిజంగా మాటల్లో చెప్పలేను. కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకుని అంతా రీసెట్ చేసుకుని తర్వాత ఏం చేయాలని ఆలోచించాల్సిన సమయం’’ అని సింధూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఆల్ ఇంగ్లండ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనడం కోసం పోయిన వారం పీవీ సిందు.. ఇంగ్లండ్ బయలుదేరారు. కాగా యుద్ధ వాతావరణంతో ఆమె దుబాయ్‌లో చిక్కుకుపోయారు. శనివారం విమాన సేవలు రద్దు కావడంతో ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. తాజా దుబాయ్‌లో చిక్కుకున్న వారిని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా అనేక మంది స్వదేశానికి చేరుకున్నారు. వారిలో పీవీ సింధూ కూడా ఒకరు.

