అమరావతి SRM యూనివర్శిటీలో క్వాంటమ్ రెవల్యూషన్ ప్రారంభం
x
అమరావతి SRM యూనివర్శిటిలో క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి SRM యూనివర్శిటీలో క్వాంటమ్ రెవల్యూషన్ ప్రారంభం

అమరావతి SRM యూనివర్శిటీలో క్వాంటమ్ రెఫెరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


క్వాంటమ్ టెస్టింగ్ బెడ్ ని ప్రారంభించిన సిఎం చంద్రబాబు. ప్రపంచ క్వాంటమ్ చిత్రపటానికెక్కిన అమరావతి


కాంట్వం టెక్నాలజీ మ్యాప్ లో భారత్ కి చోటు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ‘క్వాంటం వ్యాలీ’లో క్వాంటం కంప్యూటింగ్ పరీక్షా, రిఫరెన్స్ కేంద్రాన్ని (Quantum Test Beds) ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా (World Quantum Day) ఈ మధ్యాహ్నం ఎస్ ఆర్ ఎమ్ యూనివర్శిటీలోని విక్రమ్ సారాబాయ్ బ్లాక్ లో ‘క్వాంటమ్ హార్డ్ వేర్ టెస్ట్ బెడ్’ ని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ టెస్ట్ బెడ్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో జరిగింది. దీనికోసం ఎస్ ఆర్ ఎం విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మధ్య ఒక అవగాహన కుదిరింది.

ఎస్ ఆర్ ఎం విశ్వవిద్యాలయంలో ఏర్పాటుయిన క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్ దేశంలో జరిగే క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ కి దివిటీ లాంటిది. ఇక్కడ క్వాంటమ్ ఎలెక్ట్రానిక్స్, క్వాంటమ్ మెటీరియల్ సిమ్యులేషన్స్, క్వాంటమ్ మిషన లర్నింగ్, కీ డిస్ట్రిబ్యూషన్, క్వాంటమ్ మెనీ బాడీ& గ్రావిటీ సిమ్యూలేషన్స్, క్వాంటమ్ మెటీరియల్స్, డివైస్ సిమ్యులేషన్, క్వాంటమ్ బయాలజీ లో పరిశోధనకు వీలుంటుంది.

క్రయోజెనిక్స్, ప్రెసిషన్ ఎలెక్ట్రానిక్స్ వంటి అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని నెక్స్ట్ జనరేషన్ క్వాంటమ్ సిస్టమ్స్ ని రూపొందించేందుకు ఈ బెడ్స్ పరిశోధకులకు, విద్యార్థులకు ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న అమరావతి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ (Amaravati Quantum Reference Facility-AQRF) అనేది నేషనల్ క్వాంటమ్ మిషన్ (National Quantum Mission)లో భాగం. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దాదాపు 80 భాగస్వామ్య కంపెనీలతో కలసి ఒక ఐబిఎం 133-క్యూబిట్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తారు. దీనితో అమరావతి ప్రపంచంలో అయిదు పెద్ద క్వాంటమ్ హబ్స్ లో ఒకటి అవుతుంది.

యూనివర్శిటీ ప్రో-చాన్సలర్ పి సత్యనారాయణన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ క్వాంటమ్ టెక్నాలజీ ఎలా విద్యార్జులకు, పరిశోధకులకు, పరిశ్రమలకు గొప్పవరం కాబోతున్నదో వివరించారు. క్వాంటమ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన అన్నారు.ఈ రంగానికి త్వరలో 8.40లక్షల క్వాంటమ్ సాంకేతిక నిపుణులు అవసరమవుతరాని, ప్రస్తుతం కేవలం 35 వేల మంది మాత్రమే అందుబాటులోఉన్నారని ఆయన చెప్పారు. " ప్రస్తుతం 3.5 బిలియన్ డాలర్లు విలువే ఉన్నా త్వరలో క్వాంటమ్ టెక్నాలజీ బిజినెస్ 75 బిలియన్ డాలర్ల చేరుకోనుంది. ఇది ఇన్ ఫ్రా స్ట్రక్చర్ గా మొదలు అవుతున్నా, తొందరలోనే ఇది ఒక ఎకోసిస్టమ్ గా మారుతుంది. విద్యార్థులకు, పరిశోధకులకు, ఇంజనీర్లకు మార్గదర్శకంగా మారుతుంది," అని సత్యనారాయణన్ అన్నారు.

సభలో ప్రసంగిస్తున్న SRM యూనివర్శిటీ ప్రో-చాన్స్ లర్ డాక్టర్ పి. సత్యానారాయణ్

ఎస్ ఆర్ ఎం లో ఈ కేంద్రం మొదలయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సహకారమే కారణమని ఆయన ప్రశంచారు. చంద్ర బాబునాయుడు, ఆంధ్రప్రదేశ ప్రభుత్వ సహాకారం లేకుంటే క్వాంటమ్ రెఫెరెన్స్ టెస్ట్ బెడ్ కార్యరూపం దాల్చేది కాదని సత్యానారాయణన్ అన్నారు

అమరావతి రాజధానిని నిర్మిస్తున్న మాడెల్ లోని కాంటమ్ వ్యాలీ ఏర్పాటు జరుగుతున్నదని ఆయన అన్నారు. "అమరావతి ఆసియాలో అద్భుతమయిన నగరంగా రూపొందుతూ ఉంది. ఇక్కడ పబ్లిక్ , ప్రైవేట్ (PP) భాగస్వామ్యం నుంచి ఒక మెట్టు ఎదిగి పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ (PPP) భాగస్వామ్యం మోడెల్ లో నిర్మాణం అవుతూఉంది. ఇలాగే క్వాంటమ్ వ్యాలీ కూడా ఇదే మోడెల్ ఎన్నో సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి అవుతూ ఉంది," అని సత్యనారాయణన్ అన్నారు.

అమరావతి నిర్మాణంలో , క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడంలో ఒక నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ చెప్పిన నీతి సూత్రం దాగి ఉందని అన్నారు. అమెరికా చంద్రయానం చేయాలనుకున్నది అది సులభమయిన యాత్ర అని కాదు, చాలా కఠినమయిన ప్రయాణం అనే అని కెన్నెడి చెప్పేవారని చెబుతూ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ కూడా ఒక చాలా కష్టతరమయినప్రాజక్టు అని, దానిని చేపట్టడంలో చంద్రబాబు నాయుడు విజిన్ ఉందని అయన అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గొప్ప దార్శనికుడిగా సత్యానారాయణ్ వర్ణించారు. " చంద్రబాబు నాయుడికి విజన్ మాత్రమే కాదు, విజన్ ని నిజం చేస్తే సామర్థ్యం ఉంది. అందుకే ఆయన విజన్ ను నిజంచేసేందుకు వనరుల సమీకరణలో కూడా విజయవంతమయి అమరావతిని ఆసియాలోనే ఒక మహత్తర మహానగరంగా నిర్మిస్తున్నారు," అని అన్నారు.

ఎస్ ఆర్ ఎం క్వాంటమ్ సెంటర్

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ‘భారత్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ లు క్వాంటం కంప్యూటర్ భాగాలు తయారీ రంగంలో పనిచేస్తున్న వారికి, క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలనుకునే వారికి ఏంతో ఉపకరిస్తాయి. ఇలాంటి కేంద్రాలు భారత్ లో మొదలు కావడం ఇదే మొదటిసారి. ఇవి ఓపెన్-యాక్సెస్ సహాయ కేంద్రంగా పనిచేస్తుంది.ఈ కేంద్రం రక్షణ శాఖ నుంచి వైద్య సదుపాయాలదాకా విప్లవాత్మక మార్పులకు బాట వేస్తాయి. ముఖ్యంగా సెమీకండక్టర్ తయారీ రంగానికి బాగా దోహదపడుతుంది.

SRM విశ్వవిద్యాలయంలో ఏర్పాటయిన భారత్ క్వాంటం రిఫరెన్స్ కేంద్రం, పరిశోధకులకు క్వాంటం కంప్యూటింగ్ భాగాల పరీక్ష, ధ్రువీకరణను అందించడంతో పాటు, విద్యార్థులకు అధునాతన క్వాంటం సంబంధిత కోర్సులలో శిక్షణ ఇస్తుంది.

ఈ యూనివర్శిటీతో పాటు మరొక సెంటర్ అమరావతిలోని మేధాటవర్స్ లో ఏర్పాటయింది. క్యూబిటెక్ (Qubitech) ఏర్పాటు చేసిన ఈ ‘క్వాంటం క్యారిక్టరైజేషన్ ఫెసిలిటీ’ వర్చువల్ పద్ధతిలో ముఖ్య మంత్రి ప్రారంభించారు. అది కూడా ఈ రోజునుంచే పనిచేయడం ప్రారంభించింది.





Read More
Next Story