అకౌంట్ల ప్రీజ్ ఆర్థికంగా దెబ్బతిసేందుకే .. రాహుల్
x

అకౌంట్ల ప్రీజ్ ఆర్థికంగా దెబ్బతిసేందుకే .. రాహుల్

కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను ప్రీజ్ చేశారు. దాంతో ఏం చేయాలో ఆ పార్టీ అగ్రనేతలకు దొక్కుతోచడం లేదు.


కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ప్రీజ్‌ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేశాక సోనియా, రాహుల్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ వ్యవహర శైలి తమ పార్టీకే కాదని, మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. ప్రజలు పార్టీ కోసం ఇచ్చిన విరాళాలను వాడుకోకుండా చేయడం మమ్మాటికి అప్రజాస్వామికమన్నారు.

‘‘ఎన్నికలకు నెలరోజుల ముందు మా పార్టీ ఖాతాలను స్తంభింపజేశారు. పార్టీ అభ్యర్థులకు, కార్యకర్తలకు నిధులు ఇవ్వలేకపోతున్నాం. ప్రచారానికి మా నేతలను రైళ్లలో పంపలేకపోతున్నాం. ఈ వ్యవహారంపై కోర్టులు, ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉన్నాయి’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా పార్టీని టార్గెట్ చేశారు..ఖర్గే

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తమ పార్టీని టార్గెట్ చేసిందని ఆరోపించారు. వేల కోట్ల రూపాలయలను విరాళాలుగా తీసుకుని బీజేపీ తమ బ్యాంకు ఖాతాలను తెరిచి ఉంచి, కేవలం తమ పార్టీ బ్యాంకు ఖాతాలను ఎందుకు స్తంభింపజేశారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను సీజ్ చేయడం ద్వారా ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

మాకెన్ ఏమన్నారంటే..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. అకౌంట్లను ప్రీజ్ చేయడం వల్ల తాము ప్రచారం చేసుకోలేకపోతున్నామన్నారు. పోస్టర్లు వేయించడానికి వీలులేని పరిస్థితులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజలకు తమకు మద్దతు ఇవ్వాలని అజయ్ మాకెన్ కోరారు. బీజేపీతో సహా ఏ రాజకీయ పార్టీ ఆదాయపు పన్ను చెల్లించనప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఎందుకు ఫ్రీజ్ చేశారని ఆయన ప్రశ్నించారు.

Read More
Next Story