ధనికులవి చేసినపుడు..రైతుల బకాయిలు ఎందుకు మాఫీ చేయరు?
x

ధనికులవి చేసినపుడు..రైతుల బకాయిలు ఎందుకు మాఫీ చేయరు?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి కీలక సమస్యలు దేశాన్ని వెంటాడుతున్నాయని అన్నారు.


కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి కీలక సమస్యలు దేశాన్ని వెంటాడుతున్నాయని అన్నారు. అయితే వీటిని పక్కన పెట్టి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ మార్చి 13న మహారాష్ట్రలోని ధూలే జిల్లా దొండైచా గ్రామ ప్రజలతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. కుల గణన ద్వారా దళితులు, సాధారణ వర్గాలకు చెందిన పేదలు, మైనారిటీలు, గిరిజనులు ఎక్కడ ఉన్నారో తెలుస్తుందన్నారు.

70 కోట్ల మంది ప్రజల సంపదకు సమానమైన సంపద దేశంలో 22 మంది వద్ద ఉందని ఆరోపించారు. ధనవంతుల బకాయిలు రూ. 16 లక్షల కోట్లను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం రైతుల బకాయిలను ఎందుకు మాఫీ చేయదు? అని ప్రశ్నించారు.

సాయుధ దళాలలో సైనికులకు స్వల్పకాలిక ప్రవేశం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ప్రస్తావిస్తూ.. అగ్నివీరులకు అమరవీరుల హోదా లేదా పెన్షన్ లభించదని అన్నారు. సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు వెచ్చించే పెన్షన్‌ మొత్తాన్ని, డబ్బును ప్రైవేట్‌ కంపెనీల రక్షణ వ్యాపారానికి మళ్లించాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు.

చివరి దశలో ఉన్న రాహుల్ యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించింది. మార్చి 17న ముంబైలో ముగుస్తుంది.

Read More
Next Story